ఇటీవలే కాలంలో యువత సోషల్ మీడియాలో( Social Media ) పాపులర్ అయ్యేందుకు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.తమ టాలెంట్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
అయితే ఒక్కోసారి ఫేమస్ అయ్యేందుకు చేసే ప్రయోగాలు వికటించి అందరి ముందు పరువు పోగొట్టుకొని నవ్వుల పాలు అయ్యే వారు కూడా చాలానే ఉన్నారు.
ఇలాంటి కోవలోనే ఓ యువకుడు మెట్రోలో( Metro Train ) ప్రయాణికుల ముందు స్టంట్ చేసి తన టాలెంట్ ఏంటో చూపిద్దామనుకున్నాడు.
ప్లాన్ బెడిసి కొట్టడంతో ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.వీడియో పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తూ ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ వైరల్ అయిన ఆ వీడియోలో ఏం జరిగిందంటే.ఓ యువకుడు మెట్రో రైల్ కోచ్ లో నిలబడి ఉంటాడు.తన ఫ్రెండ్ కు ఫోన్ ఇచ్చి తాను చేసే స్టంట్( Stunt ) వీడియో తీయాలని చెప్పాడు.
ఆ తరువాత గాల్లో పల్టీలు కొట్టి.ల్యాండింగ్ సమయంలో దురదృష్టవశాత్తు కాస్త బ్యాలెన్స్ తప్పాడు.
దీంతో తాను ఊహించని విధంగా తల నేలకు బలంగా తాకింది.ఈ ఘటన చూసి రైల్లో ఉండే ప్రయాణికులంతా ముందు షాక్ అయ్యారు.
తర్వాత అందరూ పగలబడి నవ్వడంతో స్టంట్ చేసిన యువకుడు సిగ్గుతో తలదించుకున్నాడు.తలకు గట్టిగా నొప్పి ఉండడంతో మౌనంగా పక్కకు వచ్చి ఒక మూలన కూర్చున్నాడు.ట్రైన్లో తోటి ప్రయాణికులు నవ్వు ఆపుకోలేకపోవడం, ఆ యువకుడు సిగ్గుతో పక్కకు వెళ్లడం వీడియోలో రికార్డ్ అయింది.ఆ వీడియో కాస్త వైరల్ అయింది.వీడియో చూసిన వారంతా దూల తీరిందా.ఇలాంటి ఎక్స్ ట్రా లు ఎందుకు అంటూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.