ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే వ్యాహాలు రచ్చిస్తున్నాయి.వైసీపీ ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు ఉత్సాహంతో ప్రజల్లోనే ఉంటూ అన్ని జిల్లాలు చుట్టేస్తున్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కౌలు రైతు భరోసా కార్యక్రమంతో అండగా ఉంటూ పార్టీ పరంగా కూడా కొంత క్లారిటీ ఇచ్చారు.
ఇక దసరా నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు.అయితే ఇప్పటి వరకు వైసీపీలో అసంతృప్తి నేతలు టీడీపీ.
జనసేన వైపు చూస్తారని అనుకున్నారు.
కానీ టీడీపీ నుంచి కొంతమంది యువనేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారట.
ఇప్పటికే టీడీపీ నుంచి కరణం బలరాం వంటి చాలామంది సీనియర్ నేతలు వైసీపీలో చేరారు.ఇక రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కొనసాగే అవకాశాలెక్కువగా ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మరింత మంది నేతలు చేరాలని అనుకుంటున్నారట.
ఇందులో ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతల కుమారులు వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారట.టీజీ వెంకటేష్ కుమారుడు భరత్, సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వంటి యంగ్ లీడర్స్ వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

వైసీపీలో భవిష్యత్తు ఉంటుందని.
అయితే ఈ యువ నేతలు వెళ్లాలనుకోవడానికి కారణం.వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారట.ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా… వైసీపీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారట.అందుకే ఇప్పుడే సర్ధుకుంటే ప్యూచర్ ఉంటుందిని భావిస్తున్నారట.ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లు ఉన్నారట.
సమయం చూసి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారట.అయితే వీళ్లే కాకుండా ఇంకా మరింత మంది టీడీపీ యువ నేతలు వైసీపీ వైపే చేస్తున్నారట.
అయితే ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన నేతలు చాలామంది ఉన్నారని… కొత్తగా వచ్చే వారికి టికెట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ యువనేతలను పార్టీలోకి ఆహ్వానించాలని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారట.ప్రస్తుతం ఈ ముచ్చట హాట్ టాపిక్ గా మరుతోంది.
ఇక ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.