యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తూనే ఉన్నాడు.రాజావారు రాణిగారు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
గత సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ దక్కించుకోలేక పోయింది.ఇక వెంటనే తదుపరి సినిమా యొక్క పనుల్లో కిరణ్ అబ్బవరం బిజీ అయ్యాడు.
మీటర్ అనే సినిమాతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

తాజాగా మీటర్ సినిమా యొక్క టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగా మంచి స్పందన దక్కింది.బాధ్యత లేని ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరాణ్ అబ్బవరం కనిపించబోతున్నాడు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో పాటు మాస్ ఆడియన్స్ యొక్క ఆదరణ పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మొదటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం మరో విశేషం.

గత చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాగా ఈసారి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన సినిమా తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.దీన్ని బట్టి చూస్తుంటే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలతో ఒకప్పుడు రవితేజ సందడి చేసినట్లుగా బాక్సాఫీస్ వద్ద త్వరలోనే సందడి చేస్తే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అనేది కచ్చితంగా మంచి విషయం అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







