మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం తెలిసిందే.చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఉపాసన గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ ఈ మధ్య ఉపాసన పదే పదే బయట మీడియాలో కనిపిస్తూ వస్తుంది.
ఆ సమయంలో ఆమె బేబీ బంప్ కనిపించక పోవడం తో మెగా అభిమానులు ఉపాసన గర్భం తో ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.నెలలు గడుస్తున్నా కొద్దీ ఆమె బేబీ బంప్ పెద్దదిగా కనిపించాల్సి ఉంటుంది, కానీ గర్భవతి అంటూ ప్రకటించిన సమయం లో ఉపాసన ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తాజాగా ఒక ఫోటో ను షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో ఉన్న విషయం తెలిసిందే.ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు చరణ్ అక్కడ సందడి చేస్తున్నాడు.చరణ్ తో పాటు ఉపాసన కూడా అక్కడే ఉంది.ఇటీవల ఇద్దరి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో షేర్ అయింది.ఆ ఫోటో లో ఉపాసన చాలా నార్మల్ గా కనిపించడం తో అసలు ఉపాసన గర్భం తో ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.రామ్ చరణ్ ఉపాసన దంపతులు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు కాబోతున్నారా అని కొత్త చర్చ మొదలైంది.

మరి కొన్ని నెలల్లో అన్ని విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతానికైతే రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వేడుకల్లో సందడి చేయబోతున్న నేపథ్యం లో అభిమానులంతా కూడా ఆ విషయాన్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, ఉపాసన గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







