బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ఏకంగా ఏడు వారాలను పూర్తి చేస్తుంది.ఇలా ఏడువారాలలో భాగంగా ఏడుగురు కంటెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
అయితే ఇదివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏడు వారాలు కూడా లేడీ కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించడం గమనార్హం.బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైనటువంటి మొదటివారం నుంచి వరుసగా ఏడువారాలపాటు హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు.
ఇక ఏడవ వారంలో భాగంగా పూజ మూర్తి ( Pooja Murthy ) హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

పూజ మూర్తి హౌస్ లో ఉన్నంతసేపు చాలా కూల్ గా గేమ్ ఆడారు.ఓట్ల కోసం ఎవరి వెంట పడలేదు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం కూడా చేయలేదు.ఎంతో నిజాయితీగా తన ఆట తాను ఆడుతూ వచ్చారు.
అయితే ఈమె ఇలా కూల్ గా గేమ్ ఆడటం ప్రేక్షకులకు బహుశా నచ్చలేదేమో తెలియదు కానీ ఈమెను హౌస్ నుంచి బయటకు పంపించేశారు.పూజ మూర్తి హౌస్ నుంచి బయటకు రావడంతో వరుసగా ఏడవ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు అయింది.
నిజానికి ఈమె అందరితోపాటు బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడే హౌస్ లోకి వెళ్లాల్సి ఉండేది.

బిగ్ బాస్ కార్యక్రమం మరికొన్ని రోజులలో ప్రారంభమవుతుంది అనగా తన తండ్రి మరణించడంతో ఈమె బిగ్ బాస్ లోకి వెళ్లకుండా ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళారు.అయితే వైల్డ్ కార్డు ద్వారా ఐదవ వారం హౌస్ లోకి వెళ్లినటువంటి ఈమె హౌస్ లోకి వెళ్లిన రెండవ వారమే బయటకు వచ్చేశారు. రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగిన పూజ మూర్తి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ( Remuneration ) తీసుకున్నారనే విషయానికి వస్తే ఈమె వారానికి రెండు లక్షలు చొప్పున రెండు వారాలకు నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.
పలు సీరియల్స్ ద్వారా ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి పూజా మూర్తి బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో ఈమెకు వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందించారని తెలుస్తుంది.
.






