ఈ ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.వెస్ట్రన్ దేశాల్లో బాగా చలి ఉంటుంది.
అలాగే మంచు కూడా కురుస్తుంటుంది.కొన్ని ప్రాంతాల్లో రహదారులు మంచుతో నిండిపోతాయి.
ఇలాంటి రహదారులపై ప్రయాణించాలంటే ప్రత్యేకంగా వాహనాలు కావలసి ఉంటుంది.అందుకోసం కంపెనీలు ఆల్రెడీ మంచుపై చాలా వేగంగా ప్రయాణించగల వాహనాలను తీసుకొచ్చాయి.
వీటిలో బైక్స్ బాగా పాపులర్ అయ్యాయి కాగా తాజాగా అమెరికన్ కంపెనీ ‘మూన్‌బైక్స్’ రీసెంట్‌గా ఒక అద్భుతమైన బైక్‌ను తయారు చేసింది.

సాధారణంగా మంచులో ప్రయాణించే వాహనాలకు టైర్లు ఉంటాయి.అయితే మూన్‌బైక్స్ తయారు చేసిన బైక్ లో మాత్రం ఫ్రంట్ సైడ్ వీల్‌కి బదులుగా మంచును చీల్చుకుపోయే షార్ప్ డివైజ్‌ను ఇచ్చారు.అలానే వెనుకవైపు యుద్ధట్యాంకుల వలె చాలా శక్తివంతమైన చైన్లతో కూడిన రెండు వీల్స్ ఆఫర్ చేశారు.
దీనివల్ల ఈ బైక్ ఎలాంటి మంచి ప్రదేశాల్లోనైనా దూసుకెళ్లగలదు.ఎగుడుదిగుడు మంచుదారిలో సైతం ఈ బైక్ ప్రయాణించగలదు.
బరువైన వస్తువులను అవలీలగా మూసుకెళ్లగలదు.

మరో విశేషం ఏంటంటే, ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్.అందువల్ల పర్యావరణానికి కొంచెం కూడా హాని కలగదు.కాగా కంపెనీ దీని ధరను 8,500 డాలర్లు (దాదాపు రూ.6.94 లక్షలు)గా నిర్ణయించింది.మంచు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది.ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.అలానే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.







