మీరు అతనికి బ్రేకప్ చెప్పండి.. సీరియల్ నటికి సలహా.. నెట్టింట్లో వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో నటీనటులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనంతరం వారి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది.

ఇలా ఎంతోమంది నటీనటులు పలు సీరియల్స్ లో నటించి ప్రేమ వివాహాలు చేసుకున్నారు.

అలా మౌనరాగం సీరియల్ ద్వారా అమ్ములు, అంకిత్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .ఈ పాత్రలలో నటించిన శివ కుమార్ ప్రియాంక జైన్ ల మధ్య మంచి పరిచయం ఏర్పడి ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.ఇకపోతే వీరిద్దరు స్టార్ మాలో మరికొన్ని సీరియల్స్లో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ ఎన్నో గుళ్ళకు గోపురాలకు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇక సోషల్ మీడియాలో వీరిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట రెడ్ కౌచ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వీరికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే శివకుమార్ తన జీవితంలో ఏ అమ్మాయి లేదని తన జీవితంలో కేవలం అమ్మ నాన్న ఒక జైన్ అమ్మాయి మాత్రమే ఉందంటూ తెలియజేశారు.

ఇలా వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు రావడంతో కొందరు నెటిజన్లు ఈ కార్యక్రమం పై స్పందిస్తూ నటి ప్రియాంకకు సలహా ఇచ్చారు.అయితే నటుడు శివ కుమార్ కాస్త ఓవర్ చేస్తున్నారు మీరు వెంటనే తనకు బ్రేకప్ చెప్పేయండి అంటూ సదరు నెటిజన్ నటి ప్రియాంక జైన్ కి సలహా ఇవ్వడంతో ప్రస్తుతం ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.ప్రస్తుతం శివ కుమార్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో నటించగా.

ప్రియాంక జైన్ జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్నారు.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement
" autoplay>

తాజా వార్తలు