ఏపీ అధికార పార్టీ వైసిపి , కేంద్ర అధికార పార్టీ బిజెపి మధ్య ఇప్పుడు పోస్టర్ వార్ నడుస్తోంది.శివరాత్రి రోజున వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ఓ కుర్రవాడికి పాలు పట్టిస్తున్న ఫోటో వైసిపి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.
ఈ పోస్ట్ వైరల్ అయింది.అయితే హిందూ దేవుళ్లను జగన్ అవమానించారని ఆరోపిస్తూ, ఏపీ బీజేపీ నాయకులు వైసిపి పై విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.‘ శివుని వేషంలో ఉన్న ఓ బాలుడికి జగన్ పాలు తాగిస్తున్నట్లు గా ఉంది కదా అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఓ ఫోటో ప్రత్యక్షమైంది .ఈ పోస్ట్ వైరల్ అయిన దగ్గర నుంచి బిజెపితో పాటు, వైసీపీ రాజకీయ ప్రత్యర్థులంతా ఈ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు హిందువులతో పాటు, శివ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని, బిజెపి ఆందోళన మొదలుపెట్టింది. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని వైసీపీని డిమాండ్ చేస్తూ బిజెపి నేతలు పట్టుబడుతున్నారు.

ఈ వ్యవహారానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అవసరమైతే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమని, దీనిపై ఆందోళన చేపట్టి ఉద్యమం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు.అయితే బిజెపి నేతలు ఆరోపిస్తున్నట్లుగా అందులో దేవుళ్లను కించపరిచేత విధంగా ఏముందో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైసిపి పై వారు చేస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానం చెబుతూ, వైసిపి నాయకులు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపైన స్పందించారు.
ఇందులో హిందూ ధర్మానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని , బిజెపి అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు.ప్రధాని మోది, చంద్రబాబు , పవన్ సోషల్ మీడియా పోస్టులను మాజీ మంత్రి అనిల్ పోస్ట్ చేశారు.