రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ధీమా తో ఉన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ). గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మానిఫెస్టోలో ఒకటి ,రెండు మినహా మిగిలిన అన్ని హామీలను నెరవేర్చడంతో, ప్రజల్లో తమపై నమ్మకం కుదిరిందని, తమ పాలనా కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, నేరుగా వారి వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల సొమ్ములు జమ అవుతుండడం, వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగనవసరం లేకుండా, అన్ని ఇంటి వద్ద నే పరిష్కారం అవుతుండడం ఇవన్నీ తమను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో జగన్ ఉన్నారు .
ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) తమ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి.దీంట్లో అనేక ప్రజ ఆకర్షణ పథకాలను చేర్చారు.
ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలను హైలెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే టిడిపి మేనిఫెస్టో ను మించి ఉండేలా వైసిపి తమ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటుంది.
అన్ని రకాల వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా దీనిని రపొందించినట్లు సమాచారం.రిటైర్డ్ ఐఏఎస్ లు, వివిధ రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలతో కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం.వైసిపి కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో జగన్ చర్చిస్తున్నారు.బస్సు యాత్రను చేస్తూనే ఏ రకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే విషయం పైన ఒక క్లారిటీ జగన్ వచ్చారు.
గత ఎన్నికల సమయంలో పది నుంచి, 15 అంశాలతో మేనిఫెస్టోను( Manifesto ) రూపొందించారు .ఒక కాగితంతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు.అది సక్సెస్ కావడం, కరోనా వంటి సమయంలోను ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా .ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే .లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా వారి వారి ఖాతాల్లో వాటిని జమ చేయడం వంటి వాటితో జగన్ పై జనాల్లో నమ్మకం పెరిగిందని వైసిపి అంచనా వేస్తోంది.
ఆ నమ్మకంతోనే కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించడమే కాకుండా ,వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచేలా మ్యానుఫెస్టోను తయారు చేశారట.విశ్వసినీ వర్గాల ప్రకారం అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా 15 వేల రూపాయలు సైతం పెంచే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13500 రైతుకు ఇస్తున్నారు.
దీనిలో 6000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుండగా, మరో 7500 కలిపి చెల్లిస్తున్నారు.అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే వసతి దీవెన నిధులను కూడా పెంచనున్నారట.ఇక ప్రస్తుతం ఇస్తున్న 3000 పెన్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారట.
టిడిపి అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీలు ఇస్తుండడంతో , జనాలు టిడిపి వైపు డైవర్ట్ కాకుండా పెన్షన్ 3000 నుంచి 5000 వరకు పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారట.ఐదేళ్లలో దశలవారీగా పెన్షన్ ను పెంచుతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు సమాచారం.
రైతులు, మహిళలు, పెన్షన్ దారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.