చేరండి చేర్పించండి : వైసీపీలోకి వలసల గేట్లు తెరిచిన జగన్ ?

ఒక పార్టీ అధికారంలోకి కొత్తగా వచ్చిందంటే చాలు ఇతర పార్టీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నాయకులు వచ్చి చేరుతుంటారు.అధికార పార్టీలో ఉంటే కలిగే లాభాలేంటో నాయకులకు బాగా తెలుసు.

 Ycpchief Jaganstart Themembership Program Soon-TeluguStop.com

అందుకే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వలసలు జోరుగా పెరుగుతుంటాయి.అయితే ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఆ అనుభవం మాత్రం ఎదురుకాలేదు.

ఎందుకంటే ఇతర పార్టీల నుంచే వచ్చే నాయకులతో ప్రస్తుత నాయకులు ఇమడలేరని దాని ద్వారా లేనిపోని గ్రూపు తగాదాలు వస్తాయని జగన్ అలోచించి చేరికల విషయాన్ని పక్కనపెట్టేశారు.అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమాయీకరణల నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

-Telugu Political News

అయితే ఈ చేరికల్లో కూడా ఎవరిని బడితే వారిని చేర్చుకోకుండా కొంతమంది విషయంలో షరతులు అమలు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారట.ఒకవైపు చూస్తే బీజేపీ వలసల జోరు పెంచేసేంది.ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరిని తమ పార్టీలో చేర్చేసుకుని మరింత బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది.అందుకే ఇప్పుడు వైసీపీ కూడా చేరికల విషయంలో తన పంథాను మార్చుకుంది.

దీనిలో భాగంగా త్వరలోనే వైసీపీలో భారీగా చేరికలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ విధంగా చేయడం ద్వారా తమ ప్రతిపక్షటీడీపీని పూర్తిగా దెబ్బతీయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

ఈ మేరకు ప్రతి ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ఇంచార్జిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయట.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నకారణంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరాలంటే వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ షరతు విధించిన సంగతి తెలిసిందే.

అయితే మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం ఎటువంటి నిబంధనలు అమలు చేయకుండా పార్టీలో చేర్చుకోవాలని జగన్ చూస్తున్నాడట.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించేలా క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులను పార్టీలో చేర్పించేలా వైసీపీ వ్యూహం పన్నుతోంది.

ప్రస్తుతం జగన్ విదేశీ యాత్రకు సిద్దమవుతున్న నేపథ్యంలో అయన పర్యటన ముగించుకుని వచ్చాక పెద్ద ఎత్తున కీలక నాయకులు పార్టీలో చేరబోతున్నారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube