సీనియర్ నిర్మాత సురేష్ బాబు గత కొన్నాళ్లుగా ఎక్కువగా చిన్న సినిమాలపైనే దృష్టి పెట్టారు.అవకాశం వస్తే పెద్ద సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నట్లు మరోసారి నిరూపిస్తున్నారు.
వెంకటేష్ – చైతూ లతో కలిసి వెంకీ మామా సినిమాను కాస్ట్లీగానే ప్లాన్ చేస్తున్నారు.అలాగే రానా – గుణశేఖర్ కాంబోలో హిరణ్యకశిపను భారీ బడ్జెట్ లో నిర్మించనున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.నెక్స్ట్ ప్రపంచాన్ని ఆకర్షించేలా ఒక క్రికెటర్ బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు.శ్రీలంకన్ మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని తెరపైకి తెస్తున్నట్లు ఇటీవల రానా బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.మురళీధరన్ కూడా ఈ విషయంపై స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే సినిమా కోసం ఖర్చును లెక్క చేయకుండా అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కించాలని నిర్మాత సురేష్ బాబు డిసైడ్ అయ్యాడట.

ప్రపంచంలో ఉన్న ప్రముఖ భాషల్లో అలాగే క్రికెట్ తెలిసిన ప్రతి దేశంలో సినిమా విడుదల కావాలని ప్లాన్ చేసుకున్నారట.భాషతో సంబంధం లేకుండా ఒక మంచి ఎమోషనల్ జర్నీని చూపించాలని ప్రయత్నిస్తున్నారు.మురళీధరన్ పుట్టుక నుంచి రిటైర్మెంట్ వరకు సినిమా కథ సాగనున్నట్లు టాక్.