ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

విజయవాడ నగరాన్ని( Vijayawada ) వరదలు ముంచెత్తాయి.

గత 30, 40 సంవత్సరాల లో ఎప్పుడూ చూడనంత వరద బీభత్సం( Floods ) విజయవాడలో స్పష్టంగా కనిపిస్తోంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు అష్ట కష్టాలు పడుతున్నారు.చాలావరకు ఇళ్లు మునిగిపోయి.

కూడు, నీడ కోసం అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇక ప్రభుత్వం , అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు మొదలుపెట్టాయి.

ఇక ఈ వరదలను కేంద్రంగా చేసుకుని ఇటు వైసిపి అటు టిడిపి మధ్య మాటల యుద్ధం మొదలైంది.నిన్ననే విజయవాడలోని ముంపు ప్రాంతాలను వైసిపి అధినేత జగన్( Jagan ) సందర్శించారు.

Advertisement

ఈ సందర్భంగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ వ్యవహారం చర్చకు వచ్చింది.

విజయవాడ నగరాన్ని వరదలు ముంచేత్తిన నేపథ్యంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్( Krishna Lanka Retaining Wall ) కారణంగా కృష్ణలంక ప్రాంతం సురక్షితంగా ఉంది.దీనికి కారణం ఆ వాల్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనని వైసిపి మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది.ఇడుపులపాయ నుంచి నిన్న నేరుగా విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చేరుకున్న జగన్ కు ఇక్కడ ఊహించని స్థాయిలో జనాల నుంచి స్పందన వచ్చింది.

విజయవాడ నగరానికి భారీగా వరదలు వచ్చినా కృష్ణ లంక ప్రాంతం మునగక పోవడానికి ఈ రిటైనింగ్ వాల్ కారణమని, జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇది పూర్తయిందని , దీంతో తమను కాపాడింది జగనే అని కొంతమంది వ్యాఖ్యానించడం, దానిని వైసిపి మీడియా సోషల్ మీడియా హైలెట్ చేసుకోవడంతో టిడిపి కూడా రంగంలోకి దిగింది.

ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం 2014లో టిడిపి( TDP ) అధికారంలోకి వచ్చినప్పుడే మొదలైందని , సగం వరకు నిర్మాణం పూర్తయిందని, 2019లో వైసిపి( YCP ) అధికారంలోకి వచ్చాక మిగతా సగం పూర్తయిందని , దానిని జగన్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తోంది.ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం క్రెడిట్ మొత్తం చంద్రబాబుదే( Chandrababu ) అని టిడిపి హైలెట్ చేస్తుండగా వైసిపి కూడా ఆ క్రెడిట్ జగన్ కు ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.దీంతో ఈ వాల్ ఎవరు కట్టించారనే దానిపైనే ప్రస్తుతం టిడిపి వైసిపి మధ్య వారు నడుస్తోంది.

చరణ్ పై విమర్శలు చేసిన వాళ్లకు స్వామీజీ స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన ఏమన్నారంటే?
పుష్ప 2 లో జగన్ డైలాగ్... ఫుల్ సపోర్ట్ ఇస్తున్న వైసీపీ ఫ్యాన్స్?

అయితే కృష్ణలంక రిటర్నింగ్ వాల్ క్రెడిట్ అటు చంద్రబాబుతో పాటు ఇటు జగన్ కు దక్కుతుందనే విషయం అందరికి అర్ధం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు