విజయసాయిరెడ్డి ఓవర్ యాక్షన్ వైసీపీకి చేటేగా ?

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా కంగారులో ఉంది.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆ ప్రభావం ఏపీలోనూ తీవ్రంగా ఉంది.రోజురోజుకి ఇక్కడ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

వీటి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఇప్పుడు ఏపీలో కరోనా కంటే రాజకీయాలు ముఖ్యం ఉన్నట్టుగా ఏపీ అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది.ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు.

కరోనా కట్టడికి ఆయన చిత్తశుద్ధి గాని వ్యవహరిస్తున్నారు.అయితే ఆ పార్టీ కీలక నాయకులు మాత్రం ఈ సమయంలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని వారితో గిల్లికజ్జాలు పెట్టుకోవడం విమర్శల పాలవుతోంది.

Advertisement

ఎందుకంటే ఇప్పుడు రాజకీయ అంశాలకు చోటు లేదు.కరోనా కట్టడికి అన్ని పార్టీల సహకారం అవసరం.

అందరి సలహాలతో ఈ వైరస్ మహమ్మారిని కట్టడి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలి.కానీ ఆ సంగతి పూర్తిగా పక్కన పెట్టేశారు.

జగన్ తర్వాత ప్రభుత్వం పార్టీలోనూ నెంబర్ టూగా ఉంటున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు అందరితోనూ తగాదాలు పెట్టుకునే పనిలో ఉన్నారు.మొదటి నుంచి వైసీపీలో పెత్తనమంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

విజయసాయిరెడ్డి.ఎవరితోనూ సఖ్యతగా ఉండడంలేదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా అందరి తోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.అయితే విజయసాయిరెడ్డిని కట్టడి చేసే విషయంలో జగన్ మౌనంగా ఉండడం వైసీపీకి చేటు చేస్తుందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

మరీ ముఖ్యంగా చెప్పుకుంటే కేంద్ర అధికార పార్టీ బీజేపీతో ఇప్పుడు వివాదం పెట్టుకునే దిశగా విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.దానిలో భాగంగా ఏపీ బీజేపీ నాయకులను ఆయన టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బిజెపి అన్న సంగతి అందరికీ తెలిసిందే.గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఇదే రకంగా వివాదం పెట్టుకుని చేదు ఫలితాలను చవిచూసింది.

ఇప్పుడు అదే రకంగా వైసిపి వ్యవహరిస్తుండడం ఆ పార్టీకి చేటు తెచ్చే విధంగా కనిపిస్తోంది.ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టిడిపి ఏజెంట్ అని చెబుతూ ఆ వివాదంలోకి బీజేపీ హైకమాండ్ కూడా తీసుకు వచ్చేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

గత ఎన్నికల్లో బిజెపి ఏపీలో జనాలకు పంచేందుకు తెచ్చిన సొమ్మును కన్నా దుర్వినియోగం చేశారని విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు.

టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లు తీసుకున్నారని, ఇందులో బిజెపి నాయకురాలు పురందరేశ్వరి పాత్ర కూడా ఉందని ఇలా అనేక ఆరోపణలు విజయసాయిరెడ్డి చేస్తున్నారు.దీనిపై బీజేపీ కూడా అదే స్థాయిలో విమర్శలు మొదలు పెట్టింది.రెండు రోజులుగా వైసీపీ వర్సెస్ బిజెపి వివాదం చాలా తీవ్రస్థాయిలో జరుగుతోంది.

దీనిపై బీజేపీ హైకమాండ్ కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.ఒక పక్క కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ రాజకీయాలు ఏంటి అని బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటే ముందు ముందు వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.అసలే నిధుల కొరతతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సహకారం చాలా అవసరం.

ఈ సమయంలో కావాలని ఆ పార్టీతో వివాదం పెట్టుకోవడం వల్ల ఏపీ ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏమీ ఉండదు.ఈ విషయాన్ని జగన్ గుర్తించకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.

తాజా వార్తలు