వాలంటీర్ వ్యవస్థ పై వైసీపీ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్( Duvvada Srinivas ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లతోనే( Volunteers ) తాము ఎన్నికలకు వెళ్తామని ఏమి చేసుకుంటారో చేసుకోమని సవాల్ విసిరారు.
అవసరమైతే వాలంటీర్ రాజీనామా చేసైనా జగన్ కోసం తనకు అప్పగించిన 50 ఇళ్లల్లో ప్రచారం చేస్తారని అన్నారు.
వాలంటీర్లను సస్పెండ్ చేస్తే ఒక్కక్క వాలంటీర్ ఒక్కో సింహంలా మారి ఎన్నికల్లో సింహంలా పనిచేస్తారని చెప్పారు.
చంద్రబాబు ఏ డప్పు కొడితే,ఏ కాగితం ఇస్తే ఎన్నికల కమిషన్ దానికి ఒప్పుకుంటుందని ఆరోపించారు.ఈసీ దగ్గర తన మాట చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ఆపించేసారని విమర్శించారు.