నెల్లూరు: కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి కామెంట్స్.వైసీపీలో కొనసాగడం ఇష్టం లేక మౌనంగా నిష్క్రమిద్దాం అనుకున్నాను.
కాని నేను మౌనంగా నిష్క్రమిద్దాం అనుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే సమాధానం ఇస్తున్నాను.అన్ని పాములు లేచాయని ఎలిక పాము కూడా మా బావ కాకణి లేచాడు.
నేను కోటంరెడ్డికి వీర విధేయుడు అనుకుంటారు అనుకున్నాడో ఏమో ఆయన గళం వినిపించాడు.నాది ద్రోహం అయితే నిన్ను జడ్పి చైర్మన్ చేసిన నువ్వు ఆనం రామనారాయణ రెడ్డికి చేసింది ఏంటి.
వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నికేక్కడిది.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ని దగ్గరకు వస్తే నువ్వు చెప్పిన మాట గుర్తుందా.
నాడు కాంగ్రస్ మహా సముద్రం.వైసీపీ నీటి చుక్క అని మాట్లాడిన మాట నిజం కాదా.
నాడు పొదలకురులో వైఎస్ ఉగ్రహాన్ని పెట్టనియకుండా అడ్డుకున్నది నిజం కాదా.

నా మిత్రుడు చెప్పాడు కాకణి మంత్రి కాబట్టి అలా మాట్లాడాలి అని.నేను వైసిపి ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కాళ్లకు దణ్ణం పెట్టలేదు.? కాకణి చంద్రబాబుని కలిసి కాళ్లు మొక్కలేదా.కాకణి అన్ని పనులు పక్కన పెట్టి సీబీఐ విచారణ గురించి చూసుకో.నువ్వు కోర్టు దొంగతం చేశావని చెప్పట్లేదు.అన్ని వేళ్ళు ని వైపు చూపిస్తున్నాయి.సజ్జలను విమర్శిస్తే కాకణికి కోపం వస్తుంది.
నాకు ఫోన్లు ఎక్కువైయ్యాయి.నాకు వస్తున్న వంద కాల్స్ లో 70 అభినందిస్తుంటే.30 విమర్శిస్తున్నాయి.నాకు బోరుగడ్డ అనిల్ అని నంబర్ నుండి కాల్ వచ్చింది.
నా తమ్ముడిని, నన్ను కొట్టుకుంటు తీసుకుపోతాను అని బెదిరించాడు.

బోరుగడ్డ అనీల్ ని మాటలకు బెదిరేవాడిని కాను నేను.ఇలాంటి ఫోన్లు చేస్తే సజ్జల నీకు వీడియో కాల్స్ వస్తాయి.నన్ను అరెస్ట్ చేస్తే సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను నిన్న సాయంత్రానికి నా మీద కిడ్నప్ కేసు పెట్టారు.
కిడ్నప్ కేసు కాదు హత్య యత్నం కేసు పెట్టుకోండి.బోరుగడ్డ అనిల్ నన్ను నా తమ్ముడిని ఎలా కొట్టుకుంటూ తీసుకుపోతారో చూడాలని ఉంది.సజ్జల.ఎన్ని కేసులకైన, బెదిరింపులకైన నేను బెదిరేది లేదు.
ఈ ప్యాక్ టీమ్, సోషల్ మీడియాను న మీద పురమాయిస్తున్నాడు సజ్జల.నా మీద తొడ కొట్టిన కార్పొరేటర్.
మొన్న కార్యకర్తల మీటింగులో నీతోనే నేను అన్నాడు.ఇప్పుడు వారివారి అవసరాల నిమిత్తం నన్ను విడిచిపెట్టవచ్చు.
తిరిగి వస్తారన్న నమ్మకం ఉంది.

నెల్లూరు గ్రామ జాతరను స్థానిక శాసనసభ్యుడిగా నేనే ఘనంగా నిర్వహిస్తాను.మెజార్టీ కార్పొరేటర్లు, సర్పంచులు నాతో ఉండరు.కార్యకర్తలు వందకి తొంభై శాతం నాతోనే ఉన్నారు.
నాకొస్తున్న బెదిరింపులకు నాకు సెక్యూరిటీ అవసరం లేదు.నా అభిమానులే నాకు రక్ష.
నేను మాట్లాడేందుకు వెళ్తే కేసు పెట్టారు.నన్ను బెదిరించిన ఆడియో ఆధారంగా సుమోటోగా కేసు ఫైల్ చెయ్యవచ్చు.
రఘురామకృష్ణ రాజు, నరేంద్ర, అయ్యంపాత్రుడు, అచ్చెన్నాయుడు నాయకులను పెడుతున్న ఇబ్బందులను చూస్తున్నాం.ట్యాపింగ్ పై న్యాయవాదులతో చెర్చిస్తున్నాం.
నా దగ్గర 16 సెకన్ల ఆడియో మాత్రమే ఉంది.వాళ్ల దగ్గర 50 సెకన్ల ఆడియో ఉంటే పెట్టండి.
నా మిత్రుడితో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు.ఒక సంస్థ ద్వారా విచారణ చేపడితే వాస్తవాలు బయట పడతాయి.