పార్టీలో చేరికలతో ప్రజాభిమానం వస్తుందా.? భారీగా చేరికలు ప్లాన్ చేసుకుంటే.పార్టీ బలోపేతం అవుతుందా…? మరి చేరికలు ఎక్కువైతే చేరిన అవకాశాలు తగ్గిపోవా…?.చేరికలపై ప్రతి పార్టీ ఇంట్రెస్ట్ గానే ఉంటుంది.
పత్యర్థులను బలహీనపరచడానికి చేరికలు ప్రొత్సహించడం సహజమే.అయితే చేరికలు ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందన్న విషయమూ తెలిసిందే.
ఇప్పటికే చాలా చోట్ల వైసీపీలో వర్గ పోరు నడుస్తుంటే.మరోపక్క చేరికలకు ఆహ్వానిస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తోంది.ఒకప్పుడు మేము మా పార్టీలో చేర్చుకోం.
మాకు అవసరం లేదు అన్న వైసీపీయే టీడీపీని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఇప్పుడు రాజకీయ అవసరం వైసీపీకి బాగానే వచ్చింది అంటున్నారు.
టీడీపీలాగా తాము పార్టీ పిరాయింపులకు పాల్పడమని చెప్పుకున్న పార్టీ ఇప్పుడు సడెన్ గా గేర్ మార్చింది.
అయితే వైసీపీకి తలనొప్పి ఏంటంటే ఇప్పటికే వైసీపీలో లెక్కలు మిక్కిలిగా లీడర్స్ ఉన్నారు.
పైగా ప్రతీ నియోజకవర్గంలో వర్గ పోరు తీవ్రస్థాయిలో ఉంది.సామాజిక వర్గం కూడా పలు చోట్ల వ్యతిరేకిస్తోంది.
అయితే ఈ పార్టీలోనైనా ఎక్కువ మంది నాయకులు ఉంటే ఆ పార్టీకి ఇబ్బందికరమే.మరి తెలిసి తెలిసి వైసీపీ టీడీపీ నేతలకు గాలం వేయడం ఏంటని అనుకుంటున్నారు.
అయితే వైసీపీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే టీడీపీని బలహీన పర్చడం.టీడీపీలో ఈ రోజుకు కూడా చాలా బలమైన నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు.
అలాగే అక్కడ కూడా టికెట్ కోసం గట్టి పోటీ ఉంది.దాంతో ఆ పరిస్థితిని తమకు అవకాశంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తోందిట.ఈ క్రమంలోనే అసంతృప్తులను టార్గెట్ చేసి గట్టి హామితో వైసీపీలో చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీ నేతలకు గాలం…

అయితే ఉమ్మడి జిల్లాలలో టీడీపీ స్ట్రాంగ్ నేతల వేట స్టార్ట్ అయిపోయిందని ఈ జాబితా కూడా రెడీ అయిందని తెలుస్తోంది.ఇక ఈ లిస్ట్ జగన్ ఫైనలైజ్ చేసి గేట్లు ఓపెన్ చేస్తారని అంటున్నారు.టీడీపీలో ఉన్న బడా నేతలను అధికార బలంతో తమ వైపునకు తిప్పుకోవాలని వైసీపీ చూడడం మాత్రం రాజకీయ ఎత్తుగడగానే చెబుతున్నారు.
అయితే ఇప్పటికే వైసీపీలో వర్గ పోరు వేధిస్తుంటే దాన్ని సర్దుబాటు చేయకుండా కొత్తగా టీడీపీ నుంచి నేతలను తెస్తే పార్టీ శ్రేణుల్లో ఆందోళన తప్పదని అంటున్నారు.
అయితే టీడీపీకి ప్రస్తుతం ప్రజల్లో దక్కుతున్న ఆదరణను చూసి.
బలపడుతోందని భావించే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపిందని అంటున్నారు.అయితే చేరికలతో ఆ పార్టీని బలహీనపర్చగలరు కానీ.
ప్రజాభిమానాన్ని ఎలా కొనగలరని అంటున్నారు.చేరికలతో వారి అభిప్రాయాన్ని మార్చగలరా అని ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా వైసీపీలో చేరే నాయకుల కోసం ఎదరు చూడాల్సిందే…
.