అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న దర్శకుడు హను రాఘవపుడి తన మొదటి సినిమా నుంచి రాబోతున్న సీతారామం వరకు మ్యాక్సిమం ప్రేమ కథలనే తీస్తూ వచ్చాడు.ప్రేమకథల్లో హను తన మార్క్ చూపిస్తాడన్న టాక్ ఉంది.
సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా హను లవ్ స్టోరీస్ కి తెలుగు ఆడియెన్స్ లో క్రేజ్ బాగానే ఉంది.అయితే అలాంటి హను రాఘవపుడి తనకు అసలు లవ్ స్టోరీస్ అంటే నచ్చవని షాక్ ఇచ్చాడు.
సీతారామం సినిమా ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న హను రాఘవపుడి తనకు లవ్ స్టోరీస్ నచ్చవని కానీ వాటినే తీస్తుంటానని అన్నారు.
తనకు నచ్చని లవ్ స్టోరీస్ ని తీసి ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటాడు హను రాఘవపుడి.
ఇక తన సినిమాల్లో సెకండ్ హాఫ్ సరిగా ఉండదని ఓపెన్ టాక్ అని.ఈ సీతారామం తో అది కూడా దాటేస్తా అంటున్నారు డైరక్టర్ హను రాఘవపుడి.అందాల రాక్షసి టు సీతారామం 10 ఏళ్ల కెరియర్ లో కేవలం ఐదు సినిమాలే చేసిన హను రాఘవపుడి కెరియర్ లో ఓ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.అది సీతారామం తోనే వస్తుందని గట్టిగా చెబుతున్నారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.
సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.
కన్నడ భామ రష్మిక మందన్న కూడా సినిమాలో స్పెషల్ రోల్ చేసింది.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ అంతా సినిమా రిజల్ట్ మీద గట్టి నమ్మకంతో ఉన్నారు.నిన్న జరిగిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గెస్ట్ గా వచ్చి థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇదని చెప్పారు.







