టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.సంక్రాంతి వేడుకల సందర్భంగా నారావారాపల్లెకు వచ్చిన చంద్రబాబు జీవో నెంబర్.1 ప్రతులను భోగి మంటల్లో కాల్చివేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించి వేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు.
నియంత పోకడలు అంటే ఇవే అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తగులబెట్టడం అంటే భారత చట్టం, ప్రజాస్వామ్యం పట్ల అమర్యాదగా ప్రవర్తించడమేనని తెలపారు.
ఇవాళ జీవో పేపర్లను తగులబెట్టిన చంద్రబాబు రేపు రాజ్యాంగాన్ని కూడా తగులబెడతాడేమోనని విమర్శించారు.







