కృష్ణాజిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్.వైజాగ్ వచ్చి పిటిషన్స్ తీసుకుంటాని వచ్చి పిటిషన్స్ తీసుకోండి అంటే అలా కాదు నా మంది ని విడుదల చేస్తే కానీ వెళ్ళాను అంటాడు.
అంటే మంత్రులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసిన నేర చరిత్ర ఉన్నవారికి కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ్య నాయకుడా లేక ఫ్యాక్షన్ ముఠాకు నాయకుడా చెప్పాలి.ఇంతకు ముందు తిరుపతిలో, విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అదేదో పెద్ద ప్రజా కార్యక్రమం అని మీరంటారు లేదు అది పెద్ద డ్రామా అని మేమంటాము.
మీ కార్యక్రమాన్ని మేము ఆపలేదు, టీవీల నిండా, పేపర్ల నిండా వార్తలు కావలి మళ్ళీ రేపటి నుండి షూటింగ్ లకు వెళ్లిపోవాలి.పవన్ కళ్యాణ్ కు 3 రోజులు షూటింగ్ లో కాళీదొరికింది వచ్చాడు నేను వైజాక్ నుండి కదలను అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్లిపోతున్నాడు.
నేను అనుకున్నాను పర్మనెంట్ గా రూమ్ అద్దెకు తీసుకొని తన వారందరు వచ్చే వరకు ఉంటాడని అనుకున్న ఇంకా 8 మంది లోపల ఉన్నారుగా.మరి వాళ్ళను వదిలిపెట్టి వెళ్తున్నాడు.
పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద నిలబడడు, చంద్రబాబు కు ఒక శాపం ఉంది ఆయన నోట నిజం వస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని అలాగే పవన్ కళ్యాణ్ కు మాట మీద నిలబడితే అదే శాపం ఇతనికి ఉందేమో తెలియట్లేదు.రోజుకో మాట మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ కు రాజకీయాల కన్నా చంద్రబాబు ప్రయోజనం, మేలులు పొందాలని, పచ్చగా ఉండాలి కోరుకునే వ్యక్తి, తన అన్నయ్య కన్నా చంద్రబాబు బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్.
అమరావతి గురించి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అన్నాడు అది కుల రాజధాని అని అన్నాడు కర్నూలు వెళితే న నాదృష్టిలో కర్నూల్ రాజధాని అని అన్నాడు.వైజాక్ వెళితే లక్ష శాతం రాజధాని అయ్యే లక్షణాలు ఉన్న పట్టణం అని చెప్పాడు.
మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని అంటున్నావు నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్, మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లికు చేసుకో భరణం ఇస్తున్నావ్.చేసుకుంటున్నావ్ కాకపోతే నీతి సూక్తులు చెప్పేటప్పుడు మనం ఇలాంటి తప్పులు చేయకూడదు.
చాగంటి కోటేశ్వరరావు మాదిరి నీతి సూక్తులు చెప్పకూడదు, గురివింద గింజ కు కిందే నలువు ఉంటుంది కానీ మనకు మొత్తం నలుపె కదా.
నాయకులందరూ ఒకనాడు చెప్పారు అమరావతి లో రాజధాని పనికిరాదని కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ప్రజల కోసం పనిచేసే కమినిస్టులు కూడా ఇంత చెడిపోతారని అనుకోలేదు వీరందరూ చంద్రబాబు కు అమ్ముడుపోయారా లేదా కుల రాజకీయాలు చేస్తున్నారని అనాలా.ఇప్పటికైనా నిబద్దతో, నీతితో కూడిన రాజకీయాలు చేస్తే శత్రువులు కూడా హర్షిస్తారు.మీ కార్యకర్తలే సిగ్గుపడే విధంగా ఎప్పుడు ఎవరి మాట భుజాన్న వేసుకుంటాడో, ఎవరిని నెత్తిన పెట్టుకుంటాడో తెలియని పరిస్థితి.
రాజకీయాల్లో విలువలు, నిబద్ధత లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు వచ్చింది.