మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు.
సరైన రశీదు పత్రాలు లేకుండా ఓ వాహనంలో తరలిస్తున్న కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నగదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.







