టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇకపోతే చిరంజీవి తాజాగా నటించిన చిత్రం
వాల్తేరు వీరయ్య.
డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల జనవరి 13న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు రోజులు అవుతున్నా కూడా థియేటర్లో వద్ద సందడి ఏ మాత్రం తగ్గడం లేదు.అయితే చిరంజీవి సినిమాను కేవలం సామాన్యులు అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యం లోనే తాజాగా చిరంజీవి సినిమాను ఒక ఎమ్మెల్యే తన కుటుంబ సమేతంగా వెళ్లి మరి సినిమాను చూశారు.ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి చిరంజీవికి వేదాభిమాని అన్న విషయం మనందరికీ తెలిసిందే.చిరంజీవి సినిమా విడుదల అవడంతో మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు అలాగే పార్టీ కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు.

కే3 కే పిక్చర్ ప్యాలెస్ లో సినిమాను చూడడంతో పాటు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని అని, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది.అన్నదమ్ముల అనుబంధంతో వాళ్తేరు వీరయ్య సినిమా చాలా బాగుంది.ప్రతి ఒక్కరూ చూడాలి అని తెలిపారు మధుసూదన్ రెడ్డి.
అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







