వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ( Venugopalakrishna ) గుండెనొప్పి బారిన పడటం జరిగింది.దీంతో వెంటనే మంత్రిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి ( Tadepalli to Manipal Hospital )తరలించారు.ఈ క్రమంలో వైద్యులు 24 గంటలపాటు పరిశీలనలో ఉంచడం జరిగింది.
దీంతో విషయం తెలుసుకున్న సీఎం జగన్ మంత్రి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయడం జరిగిందట.కాగా మంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకొని మంత్రి అనుచరులు మరియు వైసీపీ పార్టీ నాయకులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలియజేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ( YCP party ) నిర్వహిస్తున్న బస్సు యాత్రలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చురుకుగా పాల్గొన్నారు.చాలా చోట్ల ఫుల్ ఎనర్జీతో కూడా ప్రసంగించడం జరిగింది.ఈ క్రమంలో ఒక్కసారిగా మంత్రి చెల్లుబోయినకి గుండెపోటు రావటం అందరికి షాక్ ఇచ్చినట్లయింది.2019 అసెంబ్లీ ఎన్నికలలో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.ఈ క్రమంలో సీఎం జగన్ క్యాబినెట్ మార్పు సమయంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి మంత్రి పదవి వరించడం జరిగింది.







