కొంతమంది నిజ జీవిత కథలు విన్న సమయంలో మన కళ్లు కూడా చెమర్చడం అరుదుగా జరుగుతుంది. కళ్లు లేకపోయినా ఐఏఎస్ సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదనే సంగతి తెలిసిందే.
అన్ని అవయవాలు ఉన్నవాళ్లు ఎంత కష్టపడినా ఐఏఎస్( IAS ) సాధించలేని సందర్భాలు ఉన్నాయి.ప్రాంజల్ పాటిల్( Pranjal Patil ) ఐఏఎస్ కళ్లు లేకపోయినా లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు.
తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో 773వ ర్యాంక్ సాధించిన ప్రాంజల్ పాటిల్ కంటిచూపు ఉండి ఉంటే మాత్రం మరిన్ని సంచలన విజయాలను సాధించేవారని కచ్చితంగా చెప్పవచ్చు.నేను చదువుకునే సమయంలో చదివి ఉద్ధరించేదేముంటుందని కొంతమంది విమర్శలు చేశారని ఆమె తెలిపారు.
ఆ మాటలు నాలో పట్టుదలను పెంచేవని ప్రాంజల్ పాటిల్ అన్నారు.సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో చదవడం నా కల కాగా ఆ కాలేజ్ నాకు ఐఏఎస్ గురించి పరిచయం చేసిందని ఆమె తెలిపారు.

నా బ్లాక్ అండ్ వైట్ జీవితానికి ఆ కాలేజ్ కలర్స్ ను యాడ్ చేసిందని ప్రాంజల్ పాటిల్ పేర్కొన్నారు.ఆరేళ్ల వయస్సులో ఉన్న సమయంలో మా క్లాస్ మేట్ పెన్సిల్ తో గుచ్చడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చూపు పోయిందని ప్రాంజల్ పాటిల్ అన్నారు.అమ్మానాన్న ప్రోత్సాహం వల్లే నేను కెరీర్ పరంగా సక్సెస్( Success ) సాధించానని ప్రాంజల్ పాటిల్ చెప్పుకొచ్చారు.కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్ లో( Kamla Mehta School For Blind ) పాఠశాల విద్యను పూర్తి చేశానని ఆమె కామెంట్లు చేశారు.

ఇంటర్ లో 82 శాతం పర్సంటేజ్ వచ్చిందని ప్రాంజల్ పాటిల్ పేర్కొన్నారు.2015లో ప్రిపరేషన్ ను మొదలుపెట్టి 773 ర్యాంక్ ను ఆమె సాధించారు.ఒఅగి అనే సాఫ్ట్ వేర్ సహాయంతో ప్రిపేర్ అయ్యానని ప్రాంజల్ పాటిల్ వెల్లడించారు.ప్రాంజల్ పాటిల్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.







