ఏపీలో బీసీలపై టీడీపీ ప్రత్యేక గీతాన్ని రూపొందించింది.ఈ మేరకు బీసీలపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.
ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతం చేసేది బీసీలేనని చంద్రబాబు తెలిపారు.ఈ క్రమంలోనే జయహో బీసీ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పారు.
జయహో బీసీ కార్యక్రమం కోసం మొత్తం 40 రోజుల ప్రణాళిక రచించామన్నారు.బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్న చంద్రబాబు టీడీపీలో ఉన్నంత మంది బీసీ నేతలు వైసీపీలో ఉన్నారా అని ప్రశ్నించారు.బీసీ ఉప ప్రణాళిక కింద రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు.బీసీలను అడుగడుగున వేధించిన పార్టీ వైసీపీ అని ఆరోపించారు.