సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ముందుకు వెళ్లడం కోసం కొందరిని తొక్కేస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇలా ఒక హీరోకి లేదా దర్శకుడికి నిర్మాతకి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున శత్రువులు కూడా ఉంటారు.ఒకరి విజయాన్ని ఓర్వలేక వారిని తొక్కేయడానికి వారి వెనకే పెద్ద ఎత్తున స్కెచ్ లు వేస్తూ ఉంటారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు దర్శక నిర్మాతలకు( director producers ) పెద్దగా పడదు అనే విషయం కూడా మనకు తెలిసిందే.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.
ఈయన పెద్దగా వివాదాల జోలికి వెళ్లరు తన సినిమా పనులను తాను పూర్తి చేసుకుంటారు.అలాగే తన సినిమాల గురించి వచ్చిన నెగటివ్ కామెంట్లపై కూడా ఎక్కడా స్పందించి వివాదాలకు కారణం అవ్వరు.
ఇండస్ట్రీలో చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మహేష్ బాబుకి ఇండస్ట్రీలో ఒకే ఒక వ్యక్తి శత్రువుగా ఉన్నారట.మరి మహేష్ బాబుకి శత్రువుగా మిగిలినటువంటి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అనే విషయానికి వస్తే.

మహేష్ బాబు ఆ వ్యక్తితో అసలు గొడవ కూడా పడలేదట ఆయన ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ అని తెలుస్తుంది.ఆ వ్యక్తితో మహేష్ బాబుకి ఎలాంటి గొడవలు లేవు కానీ తన సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు వెనుక భారీగా స్కెచ్ గీసి ఓ మంచి సినిమా అవకాశం తనకు రాకుండా చేయాలని ప్రయత్నాలు చేశారట అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది మహేష్ బాబు సినీ కెరియర్లో ఒక్కడు ( Okkadu ) సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమాని ఆ ప్రొడ్యూసర్ నిర్మించాలనుకున్నారట అయితే సినిమాలో మహేష్ బాబును తప్పించి మరొక హీరోని తీసుకోవాలని భావించారు.కానీ సూపర్ స్టార్ కృష్ణ ( Krishna ) సపోర్టుతో ఈ సినిమాలో మహేష్ బాబు నటించినట్టు తెలుస్తుంది.

ఇలాంటి ఒక మంచి సినిమాని మహేష్ బాబు చేస్తే తప్పకుండా ఫ్లాప్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఆ ప్రొడ్యూసర్ వేరే హీరోని తీసుకోవాలనుకున్నారట కానీ ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు ఎక్కడ కనిపించిన ఆ నిర్మాత తలదించుకొని వెళ్ళిపోతారని తెలుస్తోంది.మహేష్ బాబు కూడా ఆయన ఎక్కడ కనపడిన మాట్లాడరట.ఇలా ఇండస్ట్రీలో ఆ ఒక్క ప్రొడ్యూసర్ తో మాత్రమే మహేష్ బాబుకి విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.







