ఏలూరు జిల్లా ఉంగుటూరు ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో నీట మునిగిన వరి పంటలను ఆమె పరిశీలించారు.
తుఫాను ప్రభావంతో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.ఈ మేరకు వరికి ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు.రైతు పొలం వద్దే ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనాలన్న ఆమె రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా ఉన్నాయన్నారు.కాలువలను ఆధునీకరించకుండా తాత్సారం చేశారని మండిపడ్డారు.రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించని పరిస్థితి ఉందని విమర్శించారు.







