తోలి బడ్జెట్ సమావేశాలకు సిద్దమౌతున్న వైసీపీ సర్కార్

ఏపీ లో కొత్త గా వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది.ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక,అలానే గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాద కార్యక్రమం వంటి పలు అంశాలపై చర్చలు నిర్వహించి సభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

 Ycp Government Getting Ready For First Budget-TeluguStop.com

అయితే తొలిసారిగా వై ఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది.ఈ సమావేశాలు నిర్వహించే తేదీలను తాజాగా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం.

వచ్చే నెల అనగా జులై 11 వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

-Telugu Political News

12 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లోని ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.మొత్తంగా 15 రోజుల పాటు ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల అమలుపై దృష్టిపెట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వాటి అమలుకే పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తుంది.

బడ్జెట్‌ పై అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జులై 1, 2 తేదీల్లో సమావేశం నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube