ఏపీలో వరుస ఎన్నికల క్రమంలోనే త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి సైతం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఉప ఎన్నికను అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ అటు జనసేన + బీజేపీ కూటమి సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇక్కడ కొద్ది రోజుల వరకు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటు నిలుపుకోవడం అధికార పార్టీకి సవాల్.

అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావిస్తోన్న టీడీపీ ఇక్కడ పోటీ చేసి సత్తా చాటాలని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఫ్రూవ్ చేయాలని కసితో ఉంది.అందుకే తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసింది.ఇక వైసీపీ కూడా తమ అభ్యర్థిగా డాక్టర్ గురు మూర్తి పేరు ను అనధికారికంగా ఖరారు చేసింది.ఫిజియో థెరపిస్ట్ అయిన డాక్టర్ గురుమూర్తి జగన్ సుధీర్ఘంగా పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంటే ఉన్నారు.
జగన్ కూడా ముందుగా గురుమూర్తి పేరునే ఖరారు చేశారు.అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక కోసం ఏకంగా రు.100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్న నేపథ్యంలో గురుమూర్తికి అంత స్థోమత లేదని భావించిన జగన్ ఆయన్ను పక్కన పెట్టేశారని అంటున్నారు.స్థానిక పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడ ఈ ఖర్చు తాము భరించలేమని చెప్పడంతో ఓ మాజీ ఎంపీ రు.100 కోట్లు ఇస్తానని తనకు ఈ ఎంపీ సీటు కావాలని అడిగినట్టు తెలుస్తోంది.
సదరు మాజీ ఎంపీ పెట్టిన ఈ ప్రతిపాదనతో ఇప్పుడు జగన్ తో పాటు స్థానిక పార్టీ నేతలు సైతం గురుమూర్తి విషయంలో డైలమాలో పడడంతో పాటు ఆ మాజీ ఎంపీకి సీటు ఇస్తే ఎలా ?ఉంటుందో ? అని ఆలోచన చేస్తున్నారట.మరి ఏం జరుగుతుందో ? చూడాలి.