భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా వైజాగ్( Visakhapatnam ) వేదికగా రెండవ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 396 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో చేరరేగి 209 పరుగులు చేశాడు.దీంతో డబల్ సెంచరీ చేసిన మూడవ యువ భారత బ్యాటర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇక తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
భారత జట్టులో యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal )తప్ప మిగిలిన ఆటగాళ్లంతా అనుకున్న రీతిలో రాణించలేకపోయారు.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు.శుబ్ మన్ గిల్ 34, శ్రేయస్ అయ్యర్ 27, రజక్ పటీధర్ 32, అక్షర్ పటేల్ 27, శ్రీకర్ భరత్ 17, రవిచంద్రన్ అశ్విన్ 20, కుల్దీప్ యాదవ్ 8, జస్ప్రీత్ బూమ్రా 6 పరుగులు చేశారు.
యశస్వి జైస్వాల్ తో పాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు రాణించి ఉంటే భారత్ భారీ స్కోరు నమోదు చేసి ఉండేది.యశస్వి జైస్వాల్ తప్ప మిగిలిన ఏ ఒక్క భారత ఆటగాడు కూడా కనీసం అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు.భారత జట్టు 112 ఓవర్లలో 396 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు పూర్తిస్థాయిలో కట్టడి చేసి పెవీలియన్ కి పంపిస్తే భారత్ గెలిచే అవకాశం ఉంటుంది.
భారత పేసర్లు జస్ప్రీత్ బూమ్రా, ముఖేష్ కుమార్ లతోపాటు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్( Ravichandran Ashwin , Kuldeep Yadav ) పూర్తి స్థాయిలో రాణిస్తే.ఇంగ్లాండ్ జట్టును స్వల్ప స్కోరుకే ఆల్ అవుట్ చేసి పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.