ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పై రాకింగ్ స్టార్!

ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై ప్రతి వారం సెలెబ్రిటీల ఫోటోలను వేస్తూ ఉంటుంది.అయితే ఈసారి ఫోర్బ్స్ సౌత్ ఇండియా స్టార్ అయినా యష్ ఫోటోను ఫోర్బ్స్ కవర్ పేజీపై ప్రచురించారు.

దీంతో ఇప్పుడు ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.కన్నడ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరి ఫోటో ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ మీద రాలేదు.

అందుకే కన్నడ ప్రజలు యష్ ఖ్యాతి చూసి గర్వ పడుతున్నారు.

కేజిఎఫ్ సినిమాతో హీరో యష్ స్టార్ హీరోగా ఎదిగాడు.

అంతేకాదు యష్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే.

రాఖీ భాయ్ గా యష్ తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకున్నాడు.

Telugu Forbes Magazine, Kannada, Kgf, Yash, Yashkannada-Movie

ఇప్పుడు యష్ ఏకంగా ఫోర్బ్స్ కవర్ పేజ్ పై రావడంతో అతడి స్టార్ డమ్ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలుస్తుంది.కన్నడ ఇండస్ట్రీని చిన్న చూపు చూసే వారికీ యష్ ధీటైన జవాబు ఇచ్చినట్టు కన్నడ ప్రజలు భావిస్తున్నారు.యష్ కెజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ ని ప్రపంచ నలుమూలలా తెలిసేలా చేసాడు.

ఫోర్బ్స్ మ్యాగజైన్ పై కనిపించిన మొట్టమొదటి నటుడు యష్ కావడం విశేషం.

Telugu Forbes Magazine, Kannada, Kgf, Yash, Yashkannada-Movie

ఇలా యష్ ఫోటో ఫోర్బ్స్ మ్యాగజైన్ పై రావడం కన్నడ ప్రజలకు అమితమైన సంతోషం కలిగిస్తుంది.ఫోటో తో పాటు యష్ సినిమా ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకునేందుకు తన గ్రామం నుండి ఎలా పారిపోయి వచ్చాడో అనే కథనం కూడా ప్రచురించారు.ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఇప్పుడు కన్నడ ప్రజలు మొత్తం గర్వపడేలా చేసాడు.

ఇక యష్ ప్రెసెంట్ కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube