'కేజీఎఫ్‌ 2' కీలక ప్రకటన చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌

కన్నడ సినీ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్ 2 అప్ డేట్ ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఇచ్చేశాడు.కేజీఎఫ్‌ సినిమా సూపర డూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో కేజీఎఫ్ 2 ను అంతకు మించి తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు.

 Yash And Prashanth Neel Movie Kgf 2 Shooting Completed  ,  Kgf 2  Prabhas  ,pras-TeluguStop.com

ఒకానొక సమయంలో కేజీఎఫ్‌ 2 తో పోల్చితే కేజీఎఫ్‌ ఒక చిన్న ట్రైలర్‌ వంటిదే అని కేజీఎఫ్‌ 2 లో అసలు సినిమా ఉందంటూ చెప్పుకొచ్చాడు.అంటే ఏ రేంజ్‌ లో సినిమా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సాధించిన సినిమా కు సీక్వెల్‌ అంటే అంతకు మించి ఉంటుందనే నమ్మకం అందరిలో కూడా ఉంటుంది.కనుక ఖచ్చితంగా కేజీఎఫ్‌ 2 సినిమా మరో రేంజ్ లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో కేజీఎఫ్‌ 2 సినిమా షూటింగ్ ను ముగించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఇక విడుదల కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

జులై నెలలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.కనుక సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటున్నారు.

ఈమద్య కాలంలో పెద్ద సినిమా లు లేవు.కరోనా కారణంగా అంతా కూడా సినిమాల విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నారు.

చిన్నా చితకా సినిమాలు మాత్రమే వస్తున్న ఈ సమయంలో కేజీఎఫ్‌ 2 వంటి బిగ్గెస్ట్‌ సినిమా వస్తే ఇండియన్‌ సినీ అభిమానులు మరో రేంజ్ లో కేజీఎఫ్‌ 2 కు వసూళ్లను కట్టబెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఈ సినిమాతో యశ్‌ రేంజ్‌ మరింతగా పెరుగుతుందని అంటున్నారు.

కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ ముగియడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ త్వరలో ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube