టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.కర్నూలు జిల్లాలో “బాదుడే బాదుడు” కార్యక్రమం పేరిట మూడు రోజులపాటు పర్యటించారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది.నిన్న పర్యటనలో అడుగడుగునా నిరసనకారులు అడ్డుకోవడంతో చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆవేశానికి లోనయ్యారు.
అయితే చంద్రబాబు కర్నూలు పర్యటన పై ఆయన ప్రసంగంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కర్నూలులో మీ ఆవేశం చూసి మేము చాలా బాధపడ్డామని పేర్కొన్నారు.
మీరు ఏమి టెన్షన్ పడవద్దు.ప్రశాంతంగా ఉండండి.
తగిన సలహాలు ఇవ్వండి అంటూ చంద్రబాబుకు సూచించారు.ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారని అన్నారు.
అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.గతంలో మాదిరిగానే ప్రతి మూడు జిల్లాలకు ఓ ఇన్చార్జిని నియమించాలని యనమల తెలిపారు.