భారత మార్కెట్లో షియోమీ నుంచి షియోమీ 14 ( Xiaomi 14 )అల్ట్రా మోడళ్లు విడుదల అయ్యాయి.షియోమీ తొలిసారిగా తన ఫ్లాగ్ షిప్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
మార్చి 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.Mi వెబ్ సైట్, ఇతర అధికారిక స్టోర్లు, రిటైల్ దుకాణాల నుంచి ఈ షియోమీ 14 స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలను చూద్దాం.
షియోమీ 14 స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.36 అంగుళాల LTPO AMOLED డిస్ ప్లే ( LTPO AMOLED display )తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది.ఈ ఫోన్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో రక్షణను కలిగి ఉంది.4610mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్, 90w వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50w వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.హ్యాండ్ సెట్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 చిప్ సెట్, అడెన్నో 750 చిప్ సెట్ తో జత చేయబడుతుంది.IP 68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.OIS సపోర్టుతో 50ఎంపీ లైట్ ఫ్యూజన్ 900 ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా( 50MP ultra wide camera ), సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా తో ఉంటుంది.ధర విషయానికి వస్తే. 12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69999 గా ఉంది.ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 తక్షణ తగ్గింపు పొందవచ్చు.అంతేకాదు ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.5000 తగ్గింపు పొందవచ్చు.వీటితోపాటు మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు.
ఈ ఫోన్ క్లాసిక్ వైట్, జాడే గ్రీన్, మ్యాటీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.