Xi Jinping President of China : మూడవ టర్ము చైనా అధ్యక్షుడిగా ఎంపికైన జీ జింపింగ్‌

2013 నుంచి అప్రతిహతంగా, తిరుగులేని నాయకుడిగా, పీపుల్‌‌స రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అధ్యక్షుడిగా చైనా దశ, దిశలను మార్చుతూ, ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశంగా, అమెరికాకు వ్యతిరేక స్వరం నిలుపగలిన వ్యక్తిగా జింపింగ్‌ నేడు చైనాకు గత 10 ఏండ్లుగా అధ్యక్ష హోదాలో ప్రత్యేక నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు.రెండు టర్ముల్లో 10 ఏండ్ల పాటు మాత్రమే చైనా అధ్యక్ష పదవి చేపట్టే పరిమితి, 68-ఏండ్ల రిటైర్మెంట్‌ వయస్సు నియమం ఉండేది.

2018లో రాజ్యాంగాన్ని సవరణ చేసి తీర్మానం చేయడంతో మూడవ సారి 69-ఏండ్ల జీ జింపింగ్‌ అధ్యక్షుడిగా పునర్‌ ఎన్నిక కావడానికి మార్గం సుగమం అయ్యింది.2012 నుంచి చైనీస్‌ కమ్యునిస్‌‌ట పార్టీ జనరల్‌ సెక్రటరీగా, శక్తివంతమైన సెంట్రల్‌ మిలటరీ కమీషనర్‌ (సియంసి) చైర్మన్గా నిర్విరామ సేవలు నేటికీ అందిస్తున్నారు.బాల్యంలో అనేక ఒడుదొడుగులను అధిగమించిన జింపింగ్‌, అంచలంచలుగా ఎదిగిన తీరు ప్రసంశనీయం.

తాజాగా నిర్వహించిన 20వ పార్టీ కాంగ్రేస్లో 7గురు సభ్యుల పొలిటికల్‌ బ్యూరో, 370 మంది సభ్యుల సెంట్రల్‌ కమిటీ, పాలిట్బూ్యరో సభ్యులతో పాటు 2,400 ప్రతినిధుల కరతాళ ధ్వనుల మధ్య రాజ్యాంగ మార్పులతో రెండు టర్ములు దాటి 3వ టర్ము చైనా అధ్యక్షుడిగా, పార్టీ జనరల్‌ సెక్రటరీగా, మిలిటరీ ఛీఫ్గా ఎన్నికైన చారిత్రాత్మక విశేషం సందర్భంగా జీ జీవిత విశేషాలను మరోసారి నిశితంగా గమనించే ప్రయత్నం చేద్దాం.రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనాకు అధ్యక్షుడిగా శక్తివంతమైన మావో జెడాంగ్‌ తరువాత అంతటి బలశాలిగా జింపింగ్‌ కూడా 3వ సారి ఎంపికై సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు.

జీ జింపింగ్‌ 15 జూన్‌ 1953న క్వీ జిన్‌ - జీ జోన్గున్‌ దంపతులకు కమ్యునిస్‌‌ట నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించారు.బీజింగ్‌ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించి, మిత్రుడు లీవ్‌ హీ సాహచర్యంతో కమ్యునిస్‌‌ట భావాలను ఆకలింపు చేసుకోవడం మొదలు పెట్టారు.1966-76 మధ్య జరిగిన కల్చరల్‌ రెవల్యుషన్‌ ఫలితంగా కుటుంబం విచ్ఛిన్నం కావడం, తల్లి విడాకులు తీసుకోవడంతో జీ జంపింగ్‌ చదువులకు ఆటంకం కలిగింది.తండ్రి 1968లో జైలు పాలుకావడంతో, యెన్చువన్‌ గ్రామ ప్రాంతానికి చేరిన జీ జింపింగ్‌ అక్కడ ఇమడలేక బీజింగ్కు తిరిగి పారిపోయారు.తరువాత జరిగిన అల్లర్లలో తిరిగి గ్రామానికి చేరి 7 ఏండ్లు అక్కడే గడిపారు.1971లో కమ్యునిస్‌‌ట యూత్‌ లీగ్‌ ఆఫ్‌ చైనాలో చేరిన జింపింగ్‌ 1972లో తండ్రిని కలువగలిగారు.తీవ్ర ప్రయత్నాల అనంతరం 1974లో చైనీస్‌ కమ్యునిస్‌‌ట పార్టీలో ప్రవేశం పొందగలిగారు.1975-79 మధ్య కాలంలో శ్రామిక-కర్షక-సైనిక విద్యార్థిగా సింగ్వా యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు.ఇంజనీరింగ్‌ విద్యార్థిగా 15 శాతం సమయాన్ని మార్కిస్‌‌ట-మావో భావనలు చదువుతూ, 5 శాతం సమయాన్ని వ్యవసాయ పనులకు కేటాయించిన జింపింగ్‌ పీపుల్‌‌స లిబరేషన్‌ ఆర్మీని ఆకలింపు చేసుకున్నారు.1979లో కీ లింగ్లిన్‌ను వివాహమాడి 1982లో విడాకులు తీసుకున్నారు.తిరిగి 1987లో జానపద గాయకురాలు పెంగ్‌ లియూన్‌ను పరిణయమాడారు.

1999-2002 మధ్య ఫ్యూజియన్‌ గవర్నర్గా, 2002-07 మధ్య కాలంలో జీజియాంగ్‌ ప్రాంత పార్టీ సెక్రటరీగా, 2007లో 17వ, 18వ, 19వ సిసిపి పొలిటికల్‌ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, 2007-12 మధ్య సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శిగా పని చేశారు.2008-13ల మధ్య చైనా (పిఆర్సి) ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.2012 నుంచి నేటి వరకు సిసిపి జనరల్‌ సెక్రటరీగా, సియంసి చైర్మన్గా నేటి వరకు కొనసాగుతున్నారు.సిసిపి 18వ పార్టీ సమావేశంలో అధ్యక్ష పదవికి ఎంపికై 2013, 14 మార్చి నుంచి నేటి వరకు చైనా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.2018లో చైనా అధ్యక్ష పదవీకాల పరిమితిని తొలగించే సవరణ చేసి అవిచ్ఛిన్నంగా తొలి దఫా 2013-2018, 2వసారి 2018 నుంచి చైనా అధ్యక్షుడిగా రెండవ దఫా 2023 వరకు కొనసాగనున్నారు.ప్రస్తుతం నిర్వహించిన నేషనల్‌ పీపుల్‌‌స కాంగ్రేస్‌ (యన్పిసి) సమావేశంలో 2023 తరువాత 3వ పర్యాయం అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కమ్యునిస్‌‌ట పార్టీ ఆఫ్‌ చైనా 20వ ప్లీనరీలో చారిత్రాత్మక తీర్మానం చేయడం జరిగింది.

Advertisement

అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలం 2022లో ముగియనున్న వేళ వరుసగా 3వ సారి ఎన్నిక కావడమే కాకుండా జీవితకాలం చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కూడా ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు