ప్రపంచవ్యాప్తంగా WWE కుస్తీ పోటీలకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.ఎక్కువగా ఈ గేమ్ యూరప్ దేశాలలో జరుగుతూ ఉంటది.
ముఖ్యంగా అమెరికాలో WWE మ్యాచ్ లు( America ) నిర్వహిస్తారు.WWE అంటే ఇండియన్స్ కూడా ఎంతగానో ఇష్టపడతారు.
ఈ గేమ్ లో ఇండియా నుండి కాళీ కొన్ని సంవత్సరాల క్రితం ఆడటం జరిగింది.కేజ్ లో లేదా రింగులో… రక్తాలు వచ్చే మాదిరిగా తన్నుకు చస్తారు.
అయితే ఫస్ట్ టైం హైదరాబాద్ లో సెప్టెంబర్ 8వ తారీకు WWE మ్యాచ్ నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ GMC బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది.
అయితే హైదరాబాద్ నందు జరగబోయే WWE ఈవెంట్ కు జాన్ సీనా( John Cena ) కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు.దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడు.
ఇప్పటివరకు 16 సార్లు WWE ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు.ఈ సందర్భంగా ట్విట్టర్ లో “భారతదేశంలో WWE యూనివర్స్ నీ కలిసేందుకు అక్కడ మొట్టమొదటిగా కుస్తీ పట్టడం కోసం వేచి చూస్తున్న” అంటూ ట్వీట్ చేశారు.
WWE ప్లేయర్స్ లో జాన్ సీనాకు విపరీతమైన క్రేజ్ ఉంది.దీంతో జాన్ సీనా వస్తున్నట్లు అధికారికంగా అతనే ప్రకటించటంతో WWE లవర్స్ హైదరాబాద్ లో( Hyderabad ) జరగబోయే ఈవెంట్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు.