రోడ్లపై అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.బైక్ రైడర్ ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలి.
వీరు హెల్మెట్ ధరించాలి.అలాగే ప్రమాదకర వేగంతో కాకుండా స్లోగా పోవాలి.
ఇక సెల్‌ఫోన్ అసలే వాడకూడదు.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఇలాంటివి జరగకూడదనే డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడకూడదని పోలీసులు చెబుతుంటారు.ఈ రూల్ ఉల్లంఘించిన వారికి భారీగా ఫైన్స్ కూడా విధిస్తుంటారు.
అయితే ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడటమే కాదు బైక్ హ్యాండిల్ పూర్తిగా వదిలేశాడు.అంతేకాదు అతడు బైక్ వెనుక కూర్చొని చాలా ప్రమాదకర స్థితిలో రైడింగ్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తూ బైక్ వెనుక సీట్లో కూర్చోవడం చూడవచ్చు.అతను అలా కూర్చుని ఉండగా డ్రైవింగ్ సీట్‌లో ఎవరూ లేరు.అంటే అతడే రైడర్.అలాగే అతడే ప్యాసింజర్ కూడా.వెనక సీట్లో తాపీగా కూర్చుని కాలు మీద కాలేసుకుని ఫోన్ మాట్లాడుతూ అతను కనిపించాడు.ఈ సమయం మొత్తం బైక్ హ్యాండిల్ పూర్తిగా విడిచిపెట్టాడు.అతడిలా బైక్‌పై కూర్చుంటే బ్యాలెన్స్ ఎలా ఆగిందో కూడా అర్థం కావడం లేదు.
ఈ దృశ్యాలను వెనకే కారులో వస్తున్న ఒక వ్యక్తి కెమెరాలో రికార్డు చేశాడు.అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో బీభత్సంగా వైరల్ అవుతోంది.ఎన్నో స్టంట్స్ చూశాం కానీ ఇలాంటి స్టంట్ చూడటం ఇదే తొలిసారి అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఇదేం డ్రైవింగ్ అయ్యా బాబు.కొంచెం తేడా వచ్చినా మడతడిపోద్ది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
చూస్తుంటే అతడి బైక్‌ను దెయ్యం నడుపుతున్నట్లుగా ఉంది అని ఇంకొందరు ఫన్నీ కామెంట్‌లు పెడుతున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







