ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమాల ద్వారా అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూనే అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు.అంతే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతూ ఉంటారు.
అయితే తాజాగా టాలీవుడ్ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆస్క్ తమన్నా అంటూ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది బ్యూటీ తమన్నా .ఈ క్రమంలోని ఒక అభిమాని మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం ఏంటి? అని అడగగా.అప్పడప్పుడు నా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను.ఇది నన్ను చాలా భయపెట్టే అంశం.అని తెలిపింది తమన్న.ఏ కల్పిత పాత్రలను మీరు మీ జీవితంలో నిజంగా కలవాలనుకుంటున్నారు? షెర్లాక్ హోమ్స్ పాత్రలు అని చెప్పుకొచ్చింది.హాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా? అని ప్రశ్నించగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని సమాధానం ఇచ్చింది మిల్క్ బ్యూటీ.మీ తర్వాతి చిత్రాలు? ఏంటి అని అడగగా.

చిరంజీవిగారితో బోళా శంకర్,బబ్లీ బౌన్సర్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.త్వరలో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించబోతున్నాను అని చెప్పుకొచ్చింది తమన్న.కదా మిల్కీ బ్యూటీ తమన్న గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల ఆమె సిటీ మార్, ఎఫ్ 3 లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి హిట్ టాక్ అని సొంతం చేసుకుంది.మిల్క్ బ్యూటీ తమన్నకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో అయ్యే ముందు అందరికి తెలిసిందే.
మరీ ముఖ్యంగా తమన్న అందానికి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అదృష్టం అంటే మీ దృష్టిలో.? అని అడగగా మన కష్టానికి విధి సహాయ పడడాన్ని నేను లక్‌గా భావిస్తాను అని చెప్పుకొచ్చింది తమన్నా.







