వావ్, అదిరిపోయే ఎక్స్‌పెరిమెంట్ చేసిన టీచర్.. వీడియో వైరల్!

కెమిస్ట్రీ ఎక్స్‌పెరిమెంట్లు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి.మాయాజాలం లాంటి అనుభూతిని అందించడంలో కెమిస్ట్రీ ప్రయోగాల తర్వాతే ఏదైనా అని చెప్పొచ్చు.

ఇప్పటికే ఇంటర్నెట్‌లో డైట్ సోడా ఫౌంటెన్, ఇన్‌విజిబుల్ ఇంక్, రంగుల మంటలు, క్షణాల్లోనే ఐస్ తయారు చేయడం వంటి ప్రయోగాలు బాగా ఫేమస్ అయ్యాయి.అయితే తాజాగా మరొక ప్రయోగం పాపులర్ అవుతోంది.

ఈ ప్రయోగాన్ని స్టూడెంట్స్ ముందు ఒక టీచర్ ప్రదర్శించింది.ఇది చూసేందుకు అచ్చం మ్యాజిక్ లాగానే అనిపించింది.

దీనికి సంబంధించిన వీడియోని పూబిటీ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోలో ఒక టీచర్ రంగులేని రెండు లిక్విడ్స్ కలిగిన రెండు గాజు గ్లాసులు పట్టుకొని ఉండటం గమనించవచ్చు.

Advertisement

ఆ తర్వాత ఒక గ్లాసులోని లిక్విడ్ మరొక గ్లాస్ లో ఉన్న లిక్విడ్ లో కలిపారు.అనంతరం మళ్లీ ఆ లిక్విడ్ ని ఖాళీ గ్లాసులో పోశారు.

క్షణాల్లోనే రంగులేని ఈ లిక్విడ్స్ మిశ్రమం డార్క్ బ్లూ కలర్ లోకి మారిపోయింది.అయితే క్షణాల్లోనే కలర్ మారిపోయిన ఈ లిక్విడ్స్ చూసి విద్యార్థులు ఆశ్చర్యపోయారు.

విద్యార్థులు వావ్ అని అబ్బురపడుతూ ఉంటే టీచర్ బాగా సంతోషించారు.ఈ ప్రయోగాన్ని "అయోడిన్ క్లాక్ రియాక్షన్" అని పిలుస్తారు.

ఈ ప్రయోగం కోసం మీకు కావాల్సిందల్లా ట్యాప్ వాటర్, రెండు ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసులు, 1000 mg విటమిన్ సి మాత్రలు, అయోడిన్ టింక్చర్ (2%), హైడ్రోజన్ పెరాక్సైడ్ (3%), లిక్విడ్ లాండ్రీ స్టార్చ్.ఈ కెమికల్స్ అన్నీ కూడా హానికరమైనవే కాబట్టి ఇంటి వద్ద ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.ఒక్క క్షణంలో ఏం జరిగిందో తెలీదు కానీ ఇది నిజంగా మ్యాజిక్ లాగానే ఉంది అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.

Advertisement

ఇలాంటి ప్రయోగం నేను ఎక్కడా చూడలేదు.మా స్కూల్లో కూడా నేర్చుకో లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

చాలా ఆసక్తితో, ఉత్సాహంతో ప్రయోగాలు చేసే ఇలాంటి టీచర్లు ప్రపంచానికి కావాలని మరికొందరు టీచర్ ని పొగుడుతున్నారు.ఈ మ్యాజికల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు