ఏపీలో ఎలక్షన్స్ కు ఇంకా చాలా టైమ్ ఉంది.ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని జగన్ సర్కార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది.
దాంతో సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది.అయినప్పటికి సిఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jaganmohan Reddy )ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటి నుంచే ప్రతిక్షణం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.అసలే ప్రధాన ప్రత్యర్థి నేత జైల్లో ఉండడంతో.
ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని ప్రజల దృష్టి పూర్తిగా వైసీపీపైనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.అందులో భాగంగానే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సరికొత్త కార్యక్రమాలతో వ్యూహరచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఇటీవల పార్టీకి సంబంధించిన అందరి ప్రజాప్రతినిధులతో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ మూడు నెలల షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు.గత నెలలో జగనన్న ఆరోగ్య సురక్ష( Jagananna Arogya Suraksha ) అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి చేపట్టారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి ప్రజల యొక్క వ్యాధులను తెలుసుకొని వారికి ఉచితంగా చికిత్స అందించడం.ఇక ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ( Bus trip )చేపడుతున్నాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ యాత్రలో భాగంగా అన్నీ వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులంతా పాల్గొనే అవకాశం ఉంది.

ఇక నవంబర్ 1 నుంచి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపడుతున్నారట.దీని ద్వారా జగన్ ( CM jagan )పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారట.నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు 40 రోజులు ఈ కార్యక్రమం చేపడతారట.
ఇక డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు అడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహిస్తారట.దీని ద్వారా గ్రామస్థాయి నుంచి నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి వారిని క్రీడకారులుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాట్లు తెలుస్తోంది.
మొత్తానికి వైసీపీ చేపట్టభోతున్న ఈ నాలుగు కార్యక్రమాలు ప్రజల్లో మమేకం అయ్యే విధంగా ఉండడంతో ఈ కార్యక్రమలే ఎన్నికల ప్రచారంలా ఉపయోగ పడతాయని వైసీపీ భావిస్తోంది.మొత్తానికి జగన్ మాస్టర్ ప్లాన్ తో ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.