వామ్మో.. జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఏపీలో ఎలక్షన్స్ కు ఇంకా చాలా టైమ్ ఉంది.ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని జగన్ సర్కార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది.

దాంతో సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది.అయినప్పటికి సి‌ఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jaganmohan Reddy )ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటి నుంచే ప్రతిక్షణం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.అసలే ప్రధాన ప్రత్యర్థి నేత జైల్లో ఉండడంతో.

ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని ప్రజల దృష్టి పూర్తిగా వైసీపీపైనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగానే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సరికొత్త కార్యక్రమాలతో వ్యూహరచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

"""/" / ఇటీవల పార్టీకి సంబంధించిన అందరి ప్రజాప్రతినిధులతో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ మూడు నెలల షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు.

గత నెలలో జగనన్న ఆరోగ్య సురక్ష( Jagananna Arogya Suraksha ) అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి చేపట్టారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి ప్రజల యొక్క వ్యాధులను తెలుసుకొని వారికి ఉచితంగా చికిత్స అందించడం.

ఇక ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ( Bus Trip )చేపడుతున్నాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ యాత్రలో భాగంగా అన్నీ వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులంతా పాల్గొనే అవకాశం ఉంది.

"""/" / ఇక నవంబర్ 1 నుంచి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపడుతున్నారట.

దీని ద్వారా జగన్ ( CM Jagan )పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారట.

నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు 40 రోజులు ఈ కార్యక్రమం చేపడతారట.

ఇక డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు అడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహిస్తారట.

దీని ద్వారా గ్రామస్థాయి నుంచి నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి వారిని క్రీడకారులుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాట్లు తెలుస్తోంది.

మొత్తానికి వైసీపీ చేపట్టభోతున్న ఈ నాలుగు కార్యక్రమాలు ప్రజల్లో మమేకం అయ్యే విధంగా ఉండడంతో ఈ కార్యక్రమలే ఎన్నికల ప్రచారంలా ఉపయోగ పడతాయని వైసీపీ భావిస్తోంది.

మొత్తానికి జగన్ మాస్టర్ ప్లాన్ తో ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన బీచ్.. ఎక్కడుందంటే..