Drawing with chalkpiece : వావ్, చాక్‌పీస్‌తో అద్భుతమైన డ్రాయింగ్.. మైమరిపిస్తున్న వీడియో!

సోషల్ మీడియాలోని కళలకు సంబంధించిన వీడియోలకి కొదవలేదు.ఈ వీడియోలలో డ్రాయింగ్ వంటి కళాకృతులు నెటిజన్లను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.

పెయింట్ బ్రష్‌ల నుంచి పెన్సిల్‌ల వరకు అనేకమంది కళాకారులు తమ కళాఖండాలను ఇప్పటికే చూపించారు.కాగా తాజాగా ఒక మహిళ చాక్‌పీస్‌ తో చాలా అద్భుతమైన డ్రాయింగ్ చేసి అందర్నీ మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ అందమైన బొమ్మ గీయడానికి జస్ట్ ఓ చాక్‌పీస్‌ను మాత్రమే ఉపయోగించారని ఊహించడం కష్టం" అని ట్విట్టర్‌లో షేర్ చేసిన 1 నిమిషం నిడివి గల వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.వైరల్ వీడియోలో ఒక మహిళ గోడకు అమర్చిన ఆకుపచ్చ బోర్డుపై ఒక యువతి బొమ్మను చాక్‌పీస్‌తో గీస్తున్నట్లు చిత్రీకరిస్తున్నట్లు చూపిస్తుంది.

ఆమె మొదట గొడుగు పట్టుకున్న స్త్రీ రూపురేఖలను గీస్తుంది.తరువాత, ఆమె గొడుగు పట్టుకొన్న ఒక వ్యక్తి రూపురేఖలను కూడా గీస్తుంది.

Advertisement

చివరగా, ఆమె వారి చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాన్ని గీస్తుంది.డ్రాయింగ్‌లో గొప్పతనం ఏమిటంటే, ఈ బొమ్మలన్నీ గీసేందుకు ఆమె ఒక్క చాక్ పీస్ మాత్రమే వాడింది.

ఈ డ్రాయింగ్‌కు రియాలిటీ టచ్ అందించడానికి వీడియో చివరిలో మోషన్ గ్రాఫిక్స్‌ను కూడా యాడ్ చేశారు.ఇది చూసేందుకు మరింత అందంగా కనిపించింది.

నవంబర్ 4న పోస్ట్ చేసిన ఈ వైరల్ వీడియోకు ట్విట్టర్‌లో ఇప్పటివరకు 16 లక్షలకు పైగా వ్యూస్.వేలల్లో లైక్‌లు వచ్చాయి.

ఇది సుద్ద కళ అని నమ్మలేక ఆర్టిస్ట్‌ని నెటిజన్లు అందరూ ప్రశంసించారు.ఇది అద్భుతమైన ఆర్ట్ అని కితాభిస్తున్నారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

అద్భుతమైన వీడియోను మీరు కూడా తిలకించండి.

Advertisement

తాజా వార్తలు