కోతులు చాలా తెలివైనవి.అన్ని జంతువుల కంటే ఇవి మనుషులకు చాలా దగ్గరగా ప్రవర్తిస్తాయి.
ఒక్కోసారి వీటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే అవి నిజంగా మనుషులేననే భ్రమ కలుగుతుంది.కాగా తాజాగా ఒక తోకలేని కోతి అయిన ఒరంగుటాన్ అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోను మొదటగా రెడిట్ యూజర్ @Ainsley Sorsby అప్‌లోడ్ చేశారు.ఆ తర్వాత ఆ వీడియో ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది.ఈ వీడియో చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోలో ‘నీ బొమ్మనే గీస్తున్న చూస్తున్నావా?’ అని ఆ మహిళ సైగ చేయగానే.ఆ కోతి హా చూస్తున్నా, బాగుంది అని నవ్వుకుంటూ ఫేస్ పెట్టినట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.ఒక గ్లాస్ వెనుక ఒరంగుటాన్ మహిళా గీస్తున్న బొమ్మను చూస్తూ చాలా సంతోషం వ్యక్తం చేసింది.
ఆ కోతి ముందు ఒక మహిళ పెన్, పేపర్ పట్టుకుని ఉంది.ఈమె జంతువు కోసం స్మైలీ ఫేస్, చెట్లను గీయడం చూడవచ్చు.ఆమె డ్రాయింగ్ చేస్తున్నప్పుడు, జంతువు చాలా జాగ్రత్తగా కాగితం వైపు చూస్తూ నవ్వుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సో, స్వీట్ అని ఈ వీడియోకి లైక్స్ కొట్టేస్తున్నారు.
మహిళ వైపు చూసినప్పుడల్లా ఒరంగుటాన్ నవ్వుతున్నట్లు కనిపిస్తోంది.ఇది చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు.
ఒరంగుటాబ్‌ను బందిఖానాలో ఉంచడం ఏం బాగోలేదని కొందరు అంటున్నారు.బహుశా అది అక్కడే జన్మించి ఉండొచ్చు లేదా గాయపడితే దానిని ఇక్కడికి తెచ్చి రక్షిస్తూ ఉండొచ్చు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ వీడియోను చాలామంది ఇష్టపడుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.