ప్రపంచంలోనే ఎత్తయిన మహిళ పుట్టినప్పుడు ఎంత బరువు ఉందో తెలిస్తే..

టర్కీకి చెందిన రుమీసా గెల్గి( Rumeysa Gelgi ) ఐదు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది.ఆమె 7 అడుగుల, 0.7 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా నిలుస్తోంది.రుమీసా పొడవైన వేళ్లు, అతిపెద్ద చేతులు, జీవించి ఉన్న స్త్రీలలో పొడవైన వీపు కూడా కలిగి ఉంది.

 Worlds Tallest Woman Reveals She Had A Natural Birth Weigh 5.9 Kg When Born Deta-TeluguStop.com

ఆమె వెబ్ డెవలప్‌మెంట్, క్రైమ్ నావెల్స్ ఇష్టపడుతుంది.

రుమీసా వీవర్ సిండ్రోమ్( Weaver Syndrome ) అనే అరుదైన జన్యుపరమైన పరిస్థితితో చాలా ఎత్తుగా పుట్టింది.

ఆమె ఆరోగ్యకరమైన వారి కంటే వేగంగా, పొడవుగా పెరుగుతుంది.రుమీసా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న మొదటి టర్కిష్ మహిళ, ప్రపంచంలో 27వ వ్యక్తి.

అయితే రీసెంట్‌గా ఈ ఎత్తైన మహిళ( World’s Tallest Woman ) తన పుట్టుక గురించి ఆసక్తికర విశేషాలు పంచుకుంది.ఆమె మాట్లాడుతూ తాను పుట్టినప్పుడు 23.2 అంగుళాలు, 5.9 కిలోల బరువు ఉన్నానని చెప్పింది.ఈ బరువు సైజు అప్పుడే పుట్టిన బిడ్డకు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.అంత పరిమాణంలో ఉన్నా ఆమె సహజ ప్రసవం ద్వారా జన్మించింది.

రుమీసా తన పరిస్థితి కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది.చుట్టూ తిరగడానికి వీల్ చైర్ లేదా వాకర్ సహాయం తీసుకోవాల్సి వస్తోంది.చిన్నతనంలో ఆమెకు అనేక శస్త్రచికిత్సలు, వైద్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి.

ఆమెకు స్కోలియోసిస్( Scoliosis ) కూడా ఉంది, అంటే ఆమె వెన్నెముక వంగి ఉంటుంది.

రుమీసా ఇన్ని సవాళ్లు ఎదురైనా సరే లైఫ్ హ్యాపీగానే సాగిస్తోంది.ఆమెకు మద్దతు ఇచ్చే బలమైన కుటుంబం ఉంది.ఆమె తన చదువును ఇంట్లోనే ముగించి ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్‌గా మారింది.వీవర్ సిండ్రోమ్ లేదా స్కోలియోసిస్ ఉన్న వ్యక్తుల కోసం కూడా మాట్లాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube