అమెరికా : భారత్ వెలుపల ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ ఆలయం .. ఎన్ని వింతలో..!!

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయ హిందువులు మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను అక్కడ కూడా పాటిస్తున్నారు.

ఏ దేశానికి వెళ్లినా మూలాలు మరిచిపోకుండా ముందుకు సాగుతున్నారు.

అంతేకాదు.ఆయా ప్రాంతాల్లో హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారు.

ఇప్పుడు అనేక దేశాలలో మన ఆలయాలు వెలుగొందుతుండటం వెనుక వీరి కృషి ఎంతో వుంది.తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో( New Jersey ) భారత్ వెలుపల ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిందూ ఆలయం నిర్మితమైంది.

అక్టోబర్ 8న దీనిని ప్రారంభించనున్నారు.‘‘ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా అక్షరధామ్ ఆలయాన్ని నిర్మించామని బీఏపీఎస్ స్వామి నారాయణ్ అక్షర్‌ధామ్ సంస్థ తెలిపింది.

Advertisement

ఈ గొప్ప ఆలయం 19వ శతాబ్ధానికి చెందిన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు భగవాన్ స్వామి నారాయణ్‌( Swaminarayan Akshardham temple )కు అంకితం చేశారు.అతని 5వ ఆధ్యాత్మిక వారసుడు, ప్రఖ్యాత సెయింట్ ప్రముఖ్ స్వామి మహారాజ్ నుంచి ఈ ఆలయం ప్రేరణ పొందింది.

న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో వున్న ఈ ఆలయాన్ని 2011 నుంచి 2023 వరకు 12 సంవత్సరాల పాటు శ్రమించి నిర్మించారు.ఇందులో 12,500 మంది వాలంటీర్లు పాలు పంచుకున్నారు.అక్షర్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం 183 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది.

పురాతన హిందూ గ్రంథాల ఆధారంగా ఆలయాన్ని నిర్మించారు.ఇక్కడ 10,000 విగ్రహాలు, భారతీయ సంగీత వాయిద్యాల శిల్పాలు, నృత్య రూపాలు వున్నాయి.

ప్రధాన మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా తీర్చిదిద్దారు.12 ఉప పుణ్యక్షేత్రాలు, తొమ్మిది శిఖరాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఏర్పాటు చేశారు.1000 ఏళ్ల పాటు ఆలయం వెలుగొందేలా నిర్మించారు.దీని నిర్మాణంలో సున్నపురాయి, గులాబీ ఇసుకరాయి, పాలరాయి, గ్రానైట్‌తో సహా నాలుగు రకాల రాయిని వినియోగించారు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

ఆలయ ప్రాంగణంలో భారతీయ సాంప్రదాయ మెట్ల బావి అయిన బ్రహ్మ కుండ్( Brahmakund ) కూడా నిర్మించారు.భారత్‌లోని పవిత్ర నదులతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా వున్న 300కు పైగా నీటి వనరుల నుంచి నీటిని సేకరించి ఇందులో వుంచారు.

Advertisement

ఆలయాన్ని అక్టోబర్ 8న ప్రారంభిస్తున్నప్పటికీ.అక్టోబర్ 18 నుంచి సందర్శకులను అనుమతించనున్నారు.ప్రస్తుతం ఆలయాన్ని నిర్దిష్ట గంటల్లో సందర్శకుల కోసం తెరిచి వుంచుతున్నారు.

అయితే కొన్ని ఈవెంట్ల కారణంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 17 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు.

తాజా వార్తలు