రెక్కలు లేని ఫ్యాన్లు వచ్చేశాయి, అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా... ఇవి పని చేసే విధానం ఇది

మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.అది కాస్త ఖరీదు అయినా కూడా అంతా దాని వెనుకాల పడుతూ ఉంటారు.

 World Class Exhale Bladeless Ceiling Fans Launched In India-TeluguStop.com

కొత్త వస్తువులను ఇండియాలో వాడేందుకు ఎక్కువ శాతం ఆసక్తిని కనబర్చుతారు.ఏదైనా మార్కెట్‌లోకి కొత్తగా వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని వాడాలని అనుకుంటారు.

అలాంటిది రెక్కలు అనేవి ఉండని కొత్తరకం ఫ్యాన్‌ వచ్చింది అంటే వాడకుండా ఉంటారా, కనీసం దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అయినా ఎక్కువ మందికి ఉంటుంది.తెలుసుకోవడం ఏం కర్మ, త్వరలో మీ ఇంట్లో కూడా ఈ రెక్కలు లేని ఫ్యాన్‌ ను పెట్టుకోవచ్చు.

అమెరికన్‌ కంపెనీ అయిన ఎక్స్‌హాల్‌ వారు ఈ రెక్కలు లేని ఫ్యాన్‌లను తయారు చేశారు.అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ ఫ్యాన్‌లు అమ్ముడు పోతున్నాయి.

ఇండియాలో కూడా ఈ ఫ్యాన్‌ల బిజినెస్‌ ప్రారంభం అయ్యింది.ఇండియాలో ఈ ఫ్యాన్‌ల తయారీ ప్లాంట్‌ను భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్నారట.

ప్రస్తుతానికి అమెరికా నుండి ఫ్యాన్స్‌ను దిగుమతి చేస్తున్నారు.కంపెనీ ఇండియాలో ఇప్పటికే బిజినెస్‌ కార్యక్రమాలు మొదలు పెట్టిందని సమాచారం అందుతోంది.

మామూలుగా అయితే సీలింగ్‌ ప్యాన్‌లకు మూడు లేదా నాలుగు రెక్కలు ఉంటాయి.అయితే ఈ ఫ్యాన్‌కు మాత్రం రెక్కలు ఉండవు.రెక్కలు లేకుండా ఎలా గాలిని ఇస్తుందనేది అందరికి ఆశ్చర్యంగా కలిగిస్తుంది.దీని టెక్నాలజీ ఏంటీ అనే విషయాన్ని కంపెనీ నిర్వాహకులు చెప్పడం లేదు.

ఈ ఫ్యాన్‌ ఎక్కువగా ఏసీ రూంలలో ఉపయోగిస్తారని చెబుతున్నారు.ఏసీ గంట పాటు వేసి, ఆ తర్వాత ఆఫ్‌ చేసినా కూడా దాదాపు అయిదు నుండి ఎనిమిది గంటల పాటు అదే టెంపరేచర్‌ను మెయింటెన్‌ చేస్తుందట.

ఇది సీలింగ్‌లో కలిసి పోయి డిజైన్‌గా ఉండటంతో పాటు, ఈ ఫ్యాన్‌లో లైట్‌ కూడా ఉంటుందట.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఫ్యాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది.

రెండు మోడల్స్‌లో లభిస్తున్న ఈ ఫ్యాన్స్‌ ధరల విషయానికి వస్తే ఎల్‌ఈడీతో ఉన్న ఫ్యాన్స్‌ అయితే 25000 రూపాయలు, ఎల్‌ఈడీ లేకుండా అయితే 23,500 రూపాయలుగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్యాన్‌ల డిస్ట్రిబ్యూషన్‌ ను డోమెక్‌ సొల్యూషన్స్‌ వారు దక్కించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube