రామనవమి నాడు పాన‌కం తాగితే ఎన్నో ఆరోగ్య లాభాలో తెలుసా?

హిందువులు అత్యంత విశేషంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో శ్రీ‌రామ‌న‌వ‌మి ఒక‌టి.శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు.

అలాగే శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణం నవమి నాడే జరిగాయ‌ని న‌మ్ముతుంటారు.అందుకే అన్ని గ్రామాల్లోనూ నేడు అంగ‌రంగ వైభ‌వంగా సీతారాముల కళ్యాణాన్ని జ‌రిపిస్తుంటారు.

ఇక రామ‌న‌వ‌మి అంటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది.పాన‌కం.

శ్రీరామనవమి రోజు దేవునికి పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు.అయితే పేరుకు ప్రసాదమే అయినా పాన‌కం ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రామ‌న‌వ‌మి స్పెష‌ల్‌ పాన‌కంను తాగ‌డం వ‌ల్ల ఏయే ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చో తెలుసుకుందాం ప‌దండీ.సాధార‌ణంగా శ్రీరామ నవమి ఎండాకాలంలో వస్తుంది.

ఈ సీజన్ లో ఎన్నో రోగాలు ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా డీహైడ్రేష‌న్, స‌న్ స్ట్రోక్ వంటివి తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి.

అయితే ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో పాన‌కం గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అవును, పాన‌కం తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది.

డీహైడ్రేష‌న్, వ‌డ దెబ్బ వంటి స‌మ‌స్య‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.అలాగే పాన‌కంలో వాడే బెల్లంలో ఐర‌న్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అందువ‌ల్ల‌, దీనిని తాగితే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.శ‌రీరం యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.

Advertisement

పాన‌కంలో వేసే మిరియాల పొడి, యాల‌కులు, శొంఠి వంటి ప‌దార్థాలు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లంగా మారుస్తాయి. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, క‌ఫం వంటి సమ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.అంతేకాదు, పానకం తాగ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ అవుతారు.

నీర‌సం, అల‌స‌ట ద‌రి చేర‌కుండా ఉంటాయి.అధిక దాహం త‌గ్గుతుంది.

మ‌రియు క‌లేయం శుభ్రంగా మారుతుంది.కాబ‌ట్టి, రామనవమి నాడే కాదు.

ఈ వేస‌విలో ఎప్పుడైనా పాన‌కంను త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు.

తాజా వార్తలు