ఒత్తిడిని చిత్తు చేసే ఆవు నెయ్యి.. ఎలా తీసుకోవాలో తెలుసా?

ఆవు నెయ్యి( Cow ghee ) శరీరానికి మరియు మనసుకు అత్యంత‌ శ్రేయస్కరమని చెప్ప‌బ‌డింది.

గొప్ప రుచి, సువాస‌న క‌లిగి ఉండే ఆవు నెయ్యిని ఆహార పదార్థాల్లోనే కాకుండా పూజల్లో, యజ్ఞాల్లో కూడా ఉప‌యోగిస్తారు.

ఆవు నెయ్యిలో ప్రొటీన్లు, కాల్షియం, సోడియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, విట‌మిన్ డి ఉంటాయి.అందువ‌ల్ల ఆరోగ్య ప‌రంగా ఆవు నెయ్యి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ముఖ్యంగా ప్ర‌స్తుత రోజుల్లో ఎంతోమందిని క‌ల‌వ‌ర‌పెడుతున్న ఒత్తిడిని చిత్తు చేసే గుణాలు ఆవు నెయ్యిలో ఉన్నాయి.నిత్యం ఒత్తిడితో మ‌ద‌న ప‌డుతున్న‌వారు ఒక గ్లాస్ పాల‌ల్లో వ‌న్ టీ స్పూన్ స్వ‌చ్ఛ‌మైన ఆవు నెయ్యి క‌లిపి తీసుకోవాలి.

ఆవు నెయ్యి శరీరానికి శక్తి మరియు తేజస్సును అందిస్తుంది.మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తుంది.

Advertisement

ఒత్తిడిని స‌మ‌ర్థ‌వంతంగా దూరం చేస్తుంది.

ఆవు నెయ్యిలో మెండుగా ఉండే విట‌మిన్ ఎ( Vitamin A ) కంటి చూపును మెరుగుపరుస్తుంది.దృష్టి లోపాల‌ను త‌గ్గిస్తుంది.చ‌ర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

అలాగే ఆవు నెయ్యిని రోజుకు వ‌న్ టీ స్పూన్ చొప్పున తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌ చురుగ్గా ప‌ని చేస్తుంది.అసిడిటి మరియు అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.

మేధా శ‌క్తిని పెంపొందించ‌డానికి ఆవు నెయ్యి స‌హాయ‌ప‌డుతుంది.నిత్యం భోజ‌నంలో వ‌న్ టీ స్పూన్ ఆవు నెయ్యిని చేర్చుకోవ‌డం వల్ల జ్ఞాప‌క శ‌క్తి, ఆలోచ‌న శ‌క్తి పెరుగుతాయి.

వైరల్ వీడియో : కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..
మొదటి సినిమా ప్లాప్ అయినా రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులు

పిల్లల మానసిక వికాసానికి కూడా ఆవు నెయ్యి అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

Advertisement

ప్ర‌స్తుత చ‌లికాలంలో ఆవు నెయ్యి ఆరోగ్యానికి అండంగా ఉంటుంది.శరీర రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ గా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి వ్యాధుల నుంచి ఆవు నెయ్యి రక్షణను కల్పిస్తుంది.ఆవు నెయ్యి తీసుకుంటే బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది భావిస్తుంటారు.

కానీ నిజానికి స‌రైన మోతాదులో ఆవు నెయ్యి తీసుకుంటే శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది.ఇది కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

అయితే ఆవు నెయ్యిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు, ఆవు నెయ్యిలో కేలరీలు అధికంగా ఉండ‌టం వ‌ల్ల‌ ఇది శరీర బరువును పెంచుతుంది.

తాజా వార్తలు