సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్, 70 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో టీ షర్టు, బ్లాక్ ప్యాంటు, హై హిల్స్ ధరించి డ్యాన్స్ చేయడానికి ఒక యువతీ రెడీ అవ్వడం చూడొచ్చు.
ఆమె ఉన్న ప్లేస్ బార్ అండ్ రెస్టారెంట్ లాగా ఉంది.ఈ ప్లేస్ లో చాలామంది మగవాళ్లతో పాటు ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు.అయితే ఈ బార్ లో ఫ్లోర్ పై ఒక డ్యాన్స్ స్టెప్పు వేయాలనుకుంది ఆ యువతి.అనంతరం ఫ్లోర్ పై పడుకొని వెనక్కి వెళుతూ సూపర్ గా డాన్స్ చేసింది.
అయితే ఆమె అలా వెనక్కి వెళుతూ వెళుతూ ఒక పెద్దాయన్ని తన్నరానిచోట తన్నింది.దాంతో కళ్ళు బైర్లు కమ్మినట్లు సదరు పెద్దాయన అబ్బ అంటూ పాపం తల్లడిల్లి పోయాడు.
ఈ ట్విస్ట్ చూసిన ఆ యువతి కూడా నోరెళ్లబెట్టింది.ఇదంతా చూసి అక్కడున్న వారంతా కడుపుబ్బ నవ్వుకున్నారు.

ఈ వీడియోని లాడ్ బైబిల్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.“పాపం ఈ పెద్దాయన రాంగ్ వేలో ఎంటర్ అయినట్లు ఉన్నాడు” అని ఈ వీడియోకి ఈ పేజ్ ఓ క్యాప్షన్ జోడించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు.హై హీల్స్ బూట్స్ తో కరెక్ట్ గా క్యారెట్, ఆనియన్స్ మధ్యలో యువతి తన్నిందిగా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మీరు కూడా ఈ హిలేరియస్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.







