ఇదేందయ్యా ఇది...వోడ్కాతో ఆలూ పరాఠా...వీడియో వైరల్..

కొత్త సంవత్సరం ప్రారంభమైంది, కానీ కొన్ని విషయాలు మారలేదు.వాటిలో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లను( Food Combinations ) తయారు చేయడం ఒకటి.

ఈ ఇంటర్నెట్ ట్రెండ్ వల్ల ఇప్పటికే ఎన్నో విచిత్ర వంటకాలు వెలుగులోకి వచ్చాయి.వాటిలో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని అసహ్యాన్ని కలిగించాయి.

ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా( Vodka Aloo Paratha ) హాట్ టాపిక్ గా మారింది.అయితే తాము ఇష్టంగా తినే ఆలూ పరాఠాని వోడ్కాతో తయారు చేయడం ఏంటని చాలా మంది తిట్టిపోస్తున్నారు.

వోడ్కా కలిపితే పరాఠా టేస్ట్ ఎంత దారుణంగా మారుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని మరికొందరు పేర్కొంటున్నారు.వోడ్కా ఆలూ పరాఠాను @roopfitnessfoodiee అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తయారు చేసింది.

Advertisement

ఆమె ఈ వింత వంట తయారు చేసి తింటున్న వీడియోను పోస్ట్ చేసింది.వీడియోలో, ఆమె రెసిపీ ప్రతి దశలో నీరు, నూనెకు బదులుగా వోడ్కాని ఎలా వాడుతుందో మనం చూడవచ్చు.ఆమె పిండిని మెత్తగా చేయడానికి, మసాలా బంగాళాదుంపను( Masala Aloo ) స్టఫ్ గా వాడింది.

తడి చేయడానికి, పాన్ మీద పరాఠాను వేయించడానికి వోడ్కాను ఉపయోగింది.ఫలితంగా ఆల్కహాల్‌తో ముంచిన ఫ్లాట్‌బ్రెడ్, బలమైన వోడ్కా రుచి వచ్చింది.ఆ తర్వాత ఆమె పరాఠాను కొద్దిగా తిని దాని టేస్ట్ ఎలా ఉందో వివరించింది.

ఆమె మాట్లాడుతూ ఆ పరాఠా స్పైసీగా, హాట్ గా ఉందని, తల తిరుగుతుందని చెప్పింది.అదే సమయంలో ఆహారం, పానీయాలు రెండింటినీ ఆస్వాదించడానికి ఇది మంచి మార్గం అని కూడా ఆమె పేర్కొంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో వైరల్‌గా మారింది, 27 లక్షణకు పైగా వ్యూస్ పొందింది.అయితే ఆమె చేసిన ఈ ఫుడ్ ఎక్స్‌పరిమెంట్ నెటిజన్లను పెద్దగా ఆకట్టుకోలేదు.ఆమె ఒక మంచి వంటకాన్ని నాశనం చేసి, మంచి డ్రింక్‌ను వేస్ట్ చేసిన తీరు చూసి వారు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?
Advertisement

తాజా వార్తలు