కొన్ని కంపెనీలు అనవసర కారణాలతో ఉద్యోగులను తొలగిస్తూ ఉంటాయి.దీంతో కొంతమంది ఉద్యోగులు వేరే కంపెనీలో చేరితే.
మరికొందరు సరైన కారణం లేకుండా తీసేసినందుకు కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూ ఉంటారు.దీంతో కోర్టులు విచారణ జరిపి సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఉద్యోగికి పరిహారం ఇవ్వాలంటూ తీర్పులు ఇస్తూ ఉంటాయి.
ఇలాంటి తీర్పులను మనం చాలా చూస్తూ ఉంటాం.తాజాగా ఒక కోర్టు ఉద్యోగికి అండగా నిలిచింది.

పౌలినా బావేజ్( Paulina Bawej ) అనే 32 ఏళ్ల మహిళ లండన్ లోని సుషినోయెన్( Sushinoen Restaurant ) అనే ఓ జపనీస్ రెస్టారెంట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేరింది.అయితే కొద్ది నెలల తర్వాత మహిళ గర్భం దాల్చగా.ఈ విషయాన్ని మేనేజర్ కి చెప్పింది.దీంతో రెస్టారెంట్ లో గర్భవతి( Pregnant ) పనిచేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆమెను యాజమాన్యం వేధించడం మొదలుపెట్టింది.తొలుత ఆమెకు జీతం తగ్గించగా. తర్వాత వేరే బ్రాంచ్ కి ట్రాన్స్‌ఫర్ చేశారు.
దీంతో వారి వేధింపులు తట్టుకోలేక ఉద్యోగానికి మహిళ రిజైన్ చేసింది.అనంతరం ఎంప్లాయ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది.

2018లో మహిళ ఉద్యోగంలో చేరగా.2019లో గర్భం దాల్చింది.ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ ఆమెను ఉత్తర లండన్ లోని గోల్డర్స్ గ్రీన్‌లోని తైషో జపనీస్ రెస్టారెంట్‌కు( Taisho Japanese Restaurant ) బదిలీ చేశాడు.ఆ తర్వాత ఆమె జీతంలో 4 లక్షల యూరోలో కోత పెట్టాడు.
దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.తాజాగా తీర్పు వచ్చింది.బాధితురాలికి రూ.36 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.ప్రెగ్నెన్సీ వచ్చిందని ఉద్యోగిణి పట్ల ఇలా వ్యవహరించడం, జీతంలో కోత పెట్టడం సరికాదని సూచించింది.గర్బవతి ఉద్యోగం మానేసేలా చేసినందుకు ఇప్పుడు యాజమాన్యం పెద్ద మొత్తంలో ఆమెకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.







